లడ్డు కావాలా నాయన..! చికెన్, మటన్ కంటే తోపు.. ఆ సమస్యలు రాకుండా ఆపు..!!
నువ్వులు అధిక శక్తిని కూడా అందిస్తాయి. 100 గ్రాముల నువ్వులు 563 క్యాలరీల శక్తిని ఇస్తాయి. ఇది ఇతర ఆహార పదార్థాల కంటే ఐదు రెట్లు ఎక్కువ బలాన్నిస్తుంది. అంతేకాకుండా, నువ్వులలో జింక్, సిలీనియం, కాపర్, ఐరన్ వంటి నాలుగు ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

నువ్వుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. నువ్వులు తినడం వల్ల ఆరోగ్యానికి, ఎముక పుష్టికి, బలానికి చాలా మంచిదని ఆయుర్వేద, వైద్య నిపుణులు తరచుగా చెబుతుంటారు. సైంటిఫిక్‌గా నిరూపితమైన అనేక లాభాలు నువ్వులలో ఉన్నాయని.. వీటిని తరచుగా తీసుకోవాలని చెబుతారు.. ముఖ్యంగా, నువ్వులు ఎముకల ఆరోగ్యానికి అద్భుతమైనవి. 100 గ్రాముల నువ్వులలో 1450 మిల్లిగ్రాముల కాల్షియం, 570 మిల్లిగ్రాముల ఫాస్ఫరస్ ఉంటాయి. కాల్షియం – ఫాస్ఫరస్ ఎముకల నిర్మాణానికి, వాటి సాంద్రతను పెంచడానికి కీలకం. ఇవి కీళ్లలో ఇన్ఫ్లమేషన్ రాకుండా కూడా సహాయపడతాయి.. తద్వారా కీళ్ల నొప్పుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో నువ్వులు ముందుంటాయి. 100 గ్రాముల నువ్వులు 563 క్యాలరీల శక్తిని అందిస్తాయి. ఇది మాంసం, కోడి మాంసం వంటి వాటి కంటే ఐదు రెట్లు ఎక్కువ బలాన్నిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.. ఈ అధిక శక్తి శరీరానికి రోజంతా చురుకుగా ఉండటానికి, శారీరక శ్రమను నిర్వహించడానికి తోడ్పడుతుంది.
నువ్వులు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో నాలుగు రకాల పోషకాలు ఉన్నాయి:
* జింక్: 8.5 మైక్రో గ్రామ్స్
* సిలీనియం: 26.7 మైక్రో గ్రామ్స్
* కాపర్: 1.5 మిల్లీగ్రామ్స్
* ఐరన్: 15.6 మిల్లీగ్రామ్స్
ఈ పోషకాలు కాల్షియంతో పాటు అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి శరీర రక్షక కణజాలం, అంటే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి అత్యంత అవసరం. తెల్ల రక్త కణాలు ఐదు రకాలుగా ఉంటాయి.. లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బాసోఫిల్స్, మోనోసైట్స్. నువ్వులలోని ఈ నాలుగు పోషకాలు ఈ ఐదు రకాల రక్షక దళాల తయారీకి అద్భుతంగా ఉపయోగపడతాయని సైంటిఫిక్ గా నిరూపించబడింది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థను తిరిగి క్రియాశీలం చేయడానికి నువ్వులు చాలా మంచివని వైద్య నిపుణులు నొక్కి చెబుతున్నారు..
నువ్వులను వివిధ రకాలుగా తీసుకోవచ్చు. వీటిని బెల్లం, ఖర్జూరం లేదా తేనెతో కలిపి లడ్డులుగా తయారుచేసుకోవచ్చు. నానబెట్టిన నువ్వులను నేరుగా తినడం కూడా మంచిది. ఇంకా, నానబెట్టిన నువ్వులను గ్రైండ్ చేసి వాటి పాలను వంటలలో ఉపయోగించవచ్చు.. ఇది నువ్వుల పాలుగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నువ్వులలో మంచి కొవ్వులు కూడా ఉంటాయి.. ఇవి బలంతో పాటు, కాల్షియంతో పాటు పరోక్షంగా అనేక లాభాలను అందిస్తాయి.
శక్తివంతమైన జీవితం కోసం .. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నువ్వులను ఏదో ఒక రకంగా తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. అంతేకాకుండా.. నువ్వులను నేరుగా కూడా నమిలి తీసుకోవచ్చు.. నువ్వులను 15 నిమిషాల పాటు నమలి తినడం వల్ల వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.
శక్తివంతమైన జీవితం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ చర్చలో తెలుసుకుందాం. కేవలం జీవించడం కాదు, ఉత్సాహంగా జీవించడం ముఖ్యం. దీనికి శరీరం తగినంత శక్తి స్థాయిలను కలిగి ఉండాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నువ్వులు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. నువ్వులను 15 నిమిషాల పాటు నమలడం వల్ల వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వారానికి ఒకసారి నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుని ఎండలో గడపడం కూడా మేలు చేస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
