ఇలాంటి జ్యూస్‌లు తాగితే ఎంత డేంజరో తెలుసా..? నివారణ పద్ధతులను తెలుసుకోండి..!

|

Aug 07, 2024 | 6:53 PM

మార్కెట్‌లోని జ్యూస్‌లో కల్తీ ఎక్కువగా ఉండడం వల్ల ఒక్కోసారి జీర్ణం కావడం కూడా కష్టంగా మారుతుంది. ఇలాంటి జ్యూస్‌ తాగిన వెంటనే వాంతులు, కడుపునొప్పి మొదలవుతాయి. అందుకే అనారోగ్యం సమయంలో మార్కెట్ జ్యూస్ తాగకూడదని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఇంట్లో తయారుచేసిన ఆహారం, జ్యూస్‌లు మాత్రమే తీసుకోవాలని చెబుతుంటారు.

ఇలాంటి జ్యూస్‌లు తాగితే ఎంత డేంజరో తెలుసా..? నివారణ పద్ధతులను తెలుసుకోండి..!
Market Juice
Follow us on

మనం ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి తింటుంటాము లేదా తాగుతాము. చాలా మంది మార్కెట్‌లో లభించే అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా ఉండటానికి జ్యూస్‌లు తాగుతారు. ఎందుకంటే, పండ్లు, పండ్ల రసాలు ఆరోగ్యకరమైనవిగా భావిస్తారు. అయితే, మీరు ఆరోగ్యంగా భావించి తాగే బయటి జ్యూస్‌లు మీకు ఎంత హానికరమో తెలుసా? ఈ రసం చాలా తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. రోడ్డు పక్కన లభించే జ్యూస్‌తో మీకు ఎలాంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

కలరా:
కలరా అనేది విబ్రియో కలరా అనే వైరస్ వల్ల నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఈ వైరస్ నీటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మార్కెట్‌లో విక్రయించే జ్యూస్‌లలో స్వచ్ఛమైన నీటిని ఉపయోగించకపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మార్కెట్‌లో విక్రయించే, అపరిశుభ్రత నడుమ తయారు చేసే జ్యూస్‌లను తాగకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఫుడ్‌పాయిజన్‌:
ఈ రోజుల్లో ప్రతి వీధిలో, ప్రతి మారుమూల ప్రాంతంలో జ్యూస్ కార్నర్‌లు వెలిశాయి. వీరంతా జ్యూస్‌ను ఆరోగ్యకరమైనవిగా చెబుతుంటారు. కానీ, మీరు అక్కడ జ్యూస్ తయారు చేయడం చూస్తే మాత్రం ఇక జీవితంలో మీరు దానిని మళ్లీ తాగలేరు. రోడ్డుపక్కన తయారు చేసే జ్యూస్‌ ఎక్కువ మలినాలతో తయారవుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫుడ్ పాయిజనింగ్‌కు కొన్ని ప్రధాన కారణాలు మురికి, పాడై పోయిన పండ్ల వాడకం, పాత్రలను సరిగ్గా కడగకపోవడం మొదలైనవి. ఫుడ్ పాయిజనింగ్ వల్ల కడుపునొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, శరీరంలో బలహీనత ఏర్పడతాయి.

ఇవి కూడా చదవండి

టైఫాయిడ్:
రోడ్డు పక్కన దొరికే జ్యూస్ ఆరోగ్యానికి హానికరం. ఇందులో బాక్టీరియా, ఫంగస్ కలిగి ఉన్న మురికి నీటిని ఉపయోగిస్తారు. ఇది టైఫాయిడ్‌కు ప్రధాన కారణం. టైఫాయిడ్ వల్ల అధిక జ్వరం, కడుపునొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.

ఏ జ్యూస్ ఆరోగ్యానికి మంచిది:
మార్కెట్‌లోని జ్యూస్‌లో కల్తీ ఎక్కువగా ఉండడం వల్ల ఒక్కోసారి జీర్ణం కావడం కూడా కష్టంగా మారుతుంది. ఇలాంటి జ్యూస్‌ తాగిన వెంటనే వాంతులు, కడుపునొప్పి మొదలవుతాయి. అందుకే అనారోగ్యం సమయంలో మార్కెట్ జ్యూస్ తాగకూడదని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఇంట్లో తయారుచేసిన ఆహారం, జ్యూస్‌లు మాత్రమే తీసుకోవాలని చెబుతుంటారు.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..