Prawns Pakodi: అచ్చమైన ఆంధ్రా ఫుడ్.. సీఫుడ్ లవర్స్ కోసం వెరైటీ స్నాక్స్.. రొయ్యల పకోడీ రెసిపీ

|

Dec 23, 2022 | 12:08 PM

ముందుగా రొయ్యలను పొట్టు తీసుకుని కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకుని.. శనగపిండి. కార్న్ ప్లోర్, బియ్యం పిండి, పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం బాగా కలపాలి.

Prawns Pakodi: అచ్చమైన ఆంధ్రా ఫుడ్.. సీఫుడ్ లవర్స్ కోసం వెరైటీ స్నాక్స్.. రొయ్యల పకోడీ రెసిపీ
Royyala Pakodi Recipe
Follow us on

నాన్ వెజ్ ప్రియుల్లో సీఫుడ్ లవర్స్ డిఫరెంట్.. శరీరానికి మేలు చేసే సీఫుడ్ లో చేపలు, రొయ్యలు, పీతలు, స్టార్ ఫిష్ వంటి అనేక రకాలున్నాయి. అయినప్పటికీ రొయ్యలు వెరీ వెరీ స్పెషల్. రొయ్యలంటే ఇష్టపడని వాళ్లుండేరేమో. రొయ్యలతో కేవలం కూర, బిర్యానీలే కాదు టేస్టీ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు రొయ్యల పకోడీ ఎలా చేయా తయారు చెయ్యాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

రొయ్యలు : అరకిలో
శనగపిండి : రెండు టీస్పూనులు,
కార్న్ ప్లోర్ : ఒక టీ స్పూన్
బియ్యప్పిండి : ఒక టీస్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు- కొంచెం
పసుపు- కొంచెం
నిమ్మరసం – ఒక స్పూన్
ఉల్లిపాయలు -చిన్నగా కట్ చేసిన ముక్కలు ఒక కప్పు
కొత్తిమీర – చిన్నగా కట్ చేసినవి అరకప్పు,
కరివేపాకు – కట్ చేసిన పావు కప్పు,
ఉప్పు – రుచికి సరిపడా
నూనె -వేయించడానికి సరిపడా

ఇవి కూడా చదవండి

తయారీ విధానం: ముందుగా రొయ్యలను పొట్టు తీసుకుని కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకుని.. శనగపిండి. కార్న్ ప్లోర్, బియ్యం పిండి, పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం బాగా కలపాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలు, ముందుగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసి కలిపి.. కొంచెం నీరు పోసుకుని పకోడీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు పక్కకు పెట్టుకోవాలి.. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చెయ్యాలి. ఇప్పుడు ముందుగా రొయ్యల పకోడీ కోసం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకుని ఉప్పు చూసి.. సరిపడా ఉప్పు వేసుకుని.. వేడి నూనెలో పకోడీలను వేసుకున్నట్లు.. ఈ రొయ్యల మిక్సీని వేసుకోవాలి. అనంతరం బ్రౌన్ కలర్ వచ్చే వరకూ రొయ్యలను వేయించి తీసి పక్కకు పెట్టుకోవాలి. అనంతరం ఈ నూనెలో కరివేపాకు వేయించి తీసుకుని దానిని రొయ్యల ఫ్రైలో వేసుకోవాలి. ఇష్టమైన వారు ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం వేసుకుని రొయ్యల ఫ్రై ని తినవచ్చు లేదంటే.. టమాటా సాస్ తో కూడా తినవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..