AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghan Chicken: చికెన్ అంటే ఇష్టమా..! రెస్టారెంట్ స్టైల్‌లో ఆఫ్ఘని చికెన్ చేసుకోండి.. తింటే వావ్ అనాల్సిందే..

వర్షాకాలంలో రుచికరమైన, ప్రత్యేకమైన చికెన్ ఆహారాన్ని తినాలనుకుంటే.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఆఫ్ఘని చికెన్ తయారు చేసుకోండి. ఈ సులభమైన రెసిపీతో మృదువైన, జ్యుసి చికెన్ సిద్ధం చేసుకుని.. దీనిని గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మ రసం జోడించి అందించండి. ఈ చికెన్ ఒక్కసారి టేస్ట్ చూస్తే చాలు హృదయాన్ని గెలుచుకుంటుంది. ఈ రోజు ఆఫ్ఘని చికెన్ తయారీ పదార్థాలు..దీనిని తయారు చేసే సులభమైన పద్ధతిని తెలుసుకోండి.

Afghan Chicken: చికెన్ అంటే ఇష్టమా..! రెస్టారెంట్ స్టైల్‌లో ఆఫ్ఘని చికెన్ చేసుకోండి.. తింటే వావ్ అనాల్సిందే..
Afghani Chicken
Surya Kala
|

Updated on: Jun 27, 2025 | 6:42 PM

Share

బయట వర్షం పడుతుంటే మీరు వేడిగా, రుచికరమైన వంటకాన్ని ఆస్వాదించాలనుకుంటే క్రిస్పీ స్నాక్స్ ను ఎంచుకుంటారు కొంతమంది. అయితే నాన్ వెజ్ ప్రియులు ముఖ్యంగా వర్షాకాలంలో ఏదైనా ప్రత్యేకంగా తయారు చేసి తినాలని భావిస్తే.. ముఖ్యంగా చికెన్ ప్రియులైతే ఆఫ్ఘని చికెన్ గొప్ప ఎంపిక కావచ్చు. సాధారణంగా ప్రజలు ఈ ఆఫ్ఘని చికెన్ ని రెస్టారెంట్లలో మాత్రమే బాగా చేస్తారని అనుకుంటారు. రెస్టారెంట్ లోనే ఆఫ్ఘని చికెన్ ని తినవచ్చని భావిస్తారు. అయితే దీనిని ఆఫ్ఘని చికెన్ ని రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఆఫ్ఘని చికెన్ చేయడానికి కావలసిన పదార్థాలు

  1. చికెన్ – 500 గ్రాములు (కాలు లేదా ఎముకలు లేని చికెన్ ముక్కలు)
  2. పెరుగు-1/2 కప్పు
  3. తాజా క్రీమ్-1/4 కప్పు
  4. అల్లం-వెల్లుల్లి పేస్ట్- 1 టేబుల్ స్పూన్
  5. ఇవి కూడా చదవండి
  6. నిమ్మరసం-1 టేబుల్ స్పూన్
  7. జీడిపప్పు పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు
  8. మిరియాల పొడి- 1/2 టీస్పూన్
  9. గరం మసాలా- 1 స్పూన్
  10. ఉప్పు- రుచికి సరిపడా
  11. నూనె/నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు
  12. బొగ్గు (పొగ రుచి కోసం – ఐచ్ఛికం)

తయారీ విధానం:

  1. ముందుగా చికెన్‌ను బాగా శుభ్రంగా కడిగి.. ఒక గిన్నెలోకి తీసుకుని చికెన్ ను తీసుకుని దానిపై నిమ్మరసం, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి 30 నిమిషాలు పాటు పక్కకు పెట్టుకోండి.
  2. ఇప్పుడు మరొక గిన్నెలో పెరుగు, జీడిపప్పు పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా, క్రీమ్ కలపండి. ఈ మిశ్రమాన్ని చికెన్ మీద అప్లై చేసి కనీసం 2 గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి.
  3. ఒక పాన్ లో నూనె/నెయ్యి వేడి చేసి మ్యారినేట్ చేసిన చికెన్ ను తక్కువ మంట మీద ఉడికించి.. అన్ని వైపులా బంగారు రంగు వచ్చేలా తిప్పుతూ ఉండండి.
  4. మీకు స్మోకీ ఫ్లేవర్ ఇష్టం అయితే కొంచెం బొగ్గు వెలిగించి.. ఆ బొగ్గుని చికెన్ పైన ఉంచండి. మీకు కావాలంటే చికెన్‌ను నిప్పుల మీద పెట్టి కాసేపు కాల్చవచ్చు. దీని తర్వాత చికెన్ పైన నెయ్యి వేయండి.
  5. అంతే వేడి వేడి ఆఫ్ఘని చికెన్ రెడీ. ఇప్పుడు వేడి వేడి ఆఫ్ఘని చికెన్‌ను గ్రీన్ చట్నీ, ఉల్లిపాయలను వేసి వేడి రోటీలతో వడ్డించండి. తిన్నవారు ఆహా ఏమి రుచి అనాల్సిందే ఎవరైనా..

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..