చాలా మంది గోధుమ పిండితో చేసిన చపాతీలు లదా బ్రెడ్ తింటారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, గోధుమ పిండిలో గ్లూటిన్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది.. ఇది ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. కొందరు మాత్రం తినకూడదు.. అందుకే.. రాగి పిండి గోధుమ కంటే ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు.. కొన్నిఅనారోగ్య సమస్యలున్న వారు గోధుమ పిండికి బదులుగా రాగుల పిండితో చేసిన రొట్టెలు (రోటీ – చపాతీ) తింటే.. అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అంతేకాకుండా జావగా కూడా చేసుకుని తినవచ్చు..
రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యం లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉంటుంది. ఇది చాలా సులభంగా జీర్ణమైవుతుంది.. రాగులతో చపాతీలతోపాటు.. పలు వంటలను తయారు చేసుకోవచ్చు.. జావ, ఇడ్లీతోపాటు.. పలు రకాల పదార్థాలను తయారు చయవచ్చు..
వాస్తవానికి రాగుల పిండితో చేసిన వంటలు తినడం చాలా ఆరోగ్యకరమైనది.. ముఖ్యంగా చల్లని రోజుల్లో (చలికాలం) రాగి పిండి పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.
మీకు పదే పదే ఆకలిగా అనిపిస్తే, మీరు రాగుల పిండితో చేసిన రోటీని తినవచ్చు.. దీంతో అతిగా తినడాన్ని నియంత్రించవచ్చు. ముతక ధాన్యం కాబట్టి, ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది.
చల్లని రోజుల్లో ఎముకలు, కీళ్లలో నొప్పి చాలా సాధారణ సమస్యగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, దానిని వదిలించుకోవడానికి, రాగుల పిండి సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం మంచి పరిమాణంలో ఉంటుంది.. ఇది ఎముకల బలాన్ని మరింత పెంచుతుంది.
జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కూడా రాగుల వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్య ఉండదు.
రాగి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, హైపర్గ్లైసీమిక్ మరియు ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే రాగుల్లో ఉండే ఔషధ గుణాల వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గాయాలు త్వరగా మానిపోతాయి.
రాగి చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, మీరు మూత్రపిండాలు లేదా మూత్ర నాళాల వ్యాధితో బాధపడుతున్నట్లయితే దీనిని అస్సలు తినకండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..