Ragi Dates Malt: వేసవి నుంచి ఉపశనం, తక్షణ శక్తినిచ్చే ‘రాగి ఖ‌ర్జూరం జావ‌’ రెసిపీ మీకోసం.. షుగర్ పేషేంట్స్‌కు బెస్ట్ ఫుడ్

|

Apr 28, 2023 | 1:36 PM

రాగి జావను తాగాలనుకుంటున్నారా అయితే రాగి ఖ‌ర్జూరం జావ‌ను తయారు చేసి చూడండి. షుగర్ పేషేంట్స్ సహా పిల్లలు పెద్దలు కూడా ఈ రాగి ఖ‌ర్జూరం జావను తాగవచ్చు. ఇది వేసవి నుంచి ఉపశమనంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. 

Ragi Dates Malt: వేసవి నుంచి ఉపశనం, తక్షణ శక్తినిచ్చే రాగి ఖ‌ర్జూరం జావ‌ రెసిపీ మీకోసం.. షుగర్ పేషేంట్స్‌కు బెస్ట్ ఫుడ్
Ragi Dates Malt
Follow us on

పూర్వకాలం ఆహారపు అలవాట్లు మళ్ళీ వాడుకలోకి వస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ తృణధాన్యాలు ఆహారంగా తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ చిరుధాన్యాల్లో రాగులు ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రాగులలో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలతో పాటు బి విటమిన్లు, ఐరన్ లాంటివి అధికంగా ఉన్నాయి. ఎముకల ధృత్వానికి, రక్తహీనతకు సూపర్ ఫుడ్ రాగులు. అయితే రాగులను ఏ విధంగా ఆహారంగా తీసుకున్నా అనేక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. రాగి ఇడ్లి, రాగి దోశ, రాగి ఊతప్పం వంటి టిఫిన్స్ తో పాటు.. జావ వంటి వాటిని కూడా తయారు చేసుకుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం రాగి జావను ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు ఈ రాగి జావలో టెస్ట్ తక్కువ అంటూ దూరం జరుగుతూ ఉంటారు. కనుక పిల్లలు, పెద్దలు ఇష్టంగా రాగి జావను తాగాలనుకుంటున్నారా అయితే రాగి ఖ‌ర్జూరం జావ‌ను తయారు చేసి చూడండి. ఇప్పుడు  రాగి ఖ‌ర్జూరం జావ‌ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు: 

రాగి పిండి – అర కప్పు

ఇవి కూడా చదవండి

పాలు – ఒక కప్పు

ఖర్జురాలు – 8 నుంచి 10

యాలకుల పొడి – కొంచెం

నీరు – 1/4 లీటరు

డ్రై ఫ్రూట్స్ – అప్షనల్

తయారీ విధానం: ముందుగా ఖర్జురం నుంచి గింజలు తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిమీద ఒక గిన్నెను పెట్టుకోవాలి. అప్పుడు అర కప్పు పాలు పోసుకుని గింజలు తీసుకున్న ఖ‌ర్జూరాల‌ను వేసి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ గిన్నెను తీసుకుని రాగిపిండి, కొంచెం నీరు పోసుకుని.. ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత తీసుకుని నీరు మొత్తాన్ని పోసుకుని స్టవ్ మీద పెట్టి.. దగ్గరగా వచ్చే వరకూ ఉడికించండి. రాగి పిండి ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న ఖర్జూరం పలు పేస్ట్ వేసుకుని , మిగిలిన పాలు వేసి కలుపుకోవాలి. ఉడికిన తర్వాత యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. మరికొంచెం సేపు రాగి ఖర్జూరం ఉడికించి స్టవ్ ఆపి పక్కకు పెట్టుకోవాలి. అంతే రాగి ఖ‌ర్జూరం జావ రెడీ. దీనిని  గ్లాస్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుని అలంకరించుకోవాలి.

షుగర్ పేషేంట్స్ సహా పిల్లలు పెద్దలు కూడా ఈ రాగి ఖ‌ర్జూరం జావను తాగవచ్చు. ఇది వేసవి నుంచి ఉపశమనంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..