అమ్మ అవ్వడం అనేది వరం అన్నట్లుగా భావిస్తుంటారు స్త్రీలు. అయితే అమ్మ అవ్వడం అంత తేలికైన పని కాదు. గర్భిణీగా ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం, ఆహారం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే కడుపులో ఉన్న బిడ్డపై తీవ్రప్రభావం పడుతుంది. అందువల్ల గర్భిణీగా ఉన్నవారు అన్ని రకాల పోషకాలతో కూడిన సమతూల్య ఆహారాన్ని తీసుకోవాలి. అయితే గర్భిణీలు తీసుకోవలసిన ఆహారాలలో కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి. వాటిలో ఉండే పోషకాలు కడుపుతో ఉన్నవారికి ఎంతో అవసరం. ఇక వారికి ఉపయోగపడే కూరగాయాల్లో కాకరకాయ పాత్ర ప్రముఖమైనదని చెప్పుకోవాలి. గర్భిణీలకు కాకరకాయ చేసినంత మేలు మరే కూరగాయ కూడా చేయదంట. మరి ఈ కాకరకాయ కడుపుతో ఉన్నవారికి ఏయే ప్రయోజనాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లడ్ షుగర్: డయాబెటీస్ ఉన్న గర్భిణీలకు కాకరకాయ ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఇంకా కాకరకాయలో ఉండే కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కంటెంట్ వారి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
జీర్ణక్రియ: ముందుగా చెప్పుకున్నట్లు కాకరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భిణీలకు ఎక్కువగా ఎదురయ్యే మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను నియంత్రిస్తుంది. ఇంకా వారి కడుపులోని సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.
రోగనిరోధక శక్తి: కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉన్నందున ఇవి మానవ శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఈ క్రమంలోనే ఈ కాకరకాయ గర్భిణీల రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి అంటువ్యాధులు, ఇతర వ్యాధులతో పోరాడటానికి కావలసిన శక్తిని అందిస్తుంది. అలాగే పుట్టబోయే బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది.
చర్మ సంరక్షణ: కాకరకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉన్నందున.. ఇది గర్భిణీలలోని చర్మాన్ని సంరక్షిస్తుంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నవారు కాకరకాయను తింటే వారిలో మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
సరిపడిన బరువు: కాకరకాయలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ప్రెగ్నెంట్‌గా ఉన్నవారు బరువు పెరగకుండా ఇది నియంత్రిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..