Panasa Ginjala Curry:పనస తొనలు తిని.. గింజలు పడేస్తున్నారా.. అయితే మీకోసమే టేస్టీ టేస్టీ పనస గింజల కూర తయారీ విధానం

|

Jun 01, 2021 | 8:21 PM

Panasa Ginjala Curry:వేసవిలో లభించే పండు పనస. ఈ పనసకాయ పండితే మధురమయిన పనసతొనలనిస్తుంది.. ఇటు పచ్చిగా ఉన్నప్పుడు పనస కాయతో...

Panasa Ginjala Curry:పనస తొనలు తిని.. గింజలు పడేస్తున్నారా.. అయితే మీకోసమే టేస్టీ టేస్టీ పనస గింజల కూర తయారీ విధానం
Panasa Ginjala Curry
Follow us on

Panasa Ginjala Curry:వేసవిలో లభించే పండు పనస. ఈ పనసకాయ పండితే మధురమయిన పనసతొనలనిస్తుంది.. ఇటు పచ్చిగా ఉన్నప్పుడు పనస కాయతో వివిధ రకాలైన కూరలను తయారు చేస్తారు. పనస మసాలా కూర, పనసపొట్టు కూర, పనసగింజలకూర, పనసకాయ బిర్యానీ..ఇలా ఎలా చేసుకున్నా అద్భుతమయిన రుచిని ఇస్తుంది. అయితే ఈరోజు పనస గింజల కూర తయారీ గురించి తెలుసుకుందాం..!

పనస గింజలకూర తయారీకి కావాల్సిన పదార్ధాలు:

పనస గింజలు
టమాటా
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
కారం
రుచికి సరిపడా ఉప్పు
నూనె తగినంత
క్రీమ్ మిల్క్
ధనియాల పొడి
కరివేపాకు
అల్లంవెల్లుల్లి పేస్ట్

తయారీ విధానం :

ముందుగా పనస గింజల మీద ఉన్న పొట్టు తీసి వాటిని రెండు ముక్కలుగా చేసి ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను. అది పచ్చిమిర్చి వేసి పేస్ట్ గా చేసుకోవాలి. గ్యాస్ స్టౌ వెలిగించి బాణలి పెట్టి.. నూనె వేసి.. వేడి అయిన తర్వాత పచ్చిమిర్చి, కర్వేపాకు వేసి వేయించి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి.. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి స్మెల్ పోయేటంత వరకూ వేయించి ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. ఇలా మిశ్రమంలో ఉడికించిన పనస గింజలను వేసి వేయించుకుని అందులో కొంచెం నీరు పోసి ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత క్రీమ్ మిల్క్ పోసి.. దగ్గరగా ఉడికించుకుని కొత్తిమీర వేసి స్టౌ మీదనుంచి దించేసుకోవాలి. ఈ కూర అన్నంలోకి చపాతీలోకి కూడా ఎంతో బాగుంటుంది.

Also Read: క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లను నగదుగా మార్చి ఏకంగా రూ. 2.17 కోట్ల సంపాదన ఎక్కడంటే..!