AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palmyra Fruit Benefits : ఐస్ యాపిల్స్ ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా వదలురుగా..!

వేసవి వచ్చేసింది. మెల్లగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఈ తాపాన్ని తక్కుకోవడానికి శరీరానికి కష్టంగా ఉంటుంది. అందుకనే ఈ సమయంలో మనం తినే ఆహారం శరీరానికి వేసవి తాపాన్ని తగ్గించేవిగా ఉండాలి.. ముఖ్యంగా ఈ సీజన్ లో లభించే..

Palmyra Fruit Benefits :  ఐస్ యాపిల్స్ ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా వదలురుగా..!
Surya Kala
|

Updated on: Mar 05, 2021 | 12:03 PM

Share

Palmyra Fruit Benefits : వేసవి వచ్చేసింది. మెల్లగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఈ తాపాన్ని తక్కుకోవడానికి శరీరానికి కష్టంగా ఉంటుంది. అందుకనే ఈ సమయంలో మనం తినే ఆహారం శరీరానికి వేసవి తాపాన్ని తగ్గించేవిగా ఉండాలి.. ముఖ్యంగా ఈ సీజన్ లో లభించే ఫ్రూట్స్ ను తీసుకోవడం అత్యుత్తమం. శరీరానికి డీ హైడ్రేషన్ తగ్గించేది పుచ్చకాయ.. అందుకనే దీనిని ఎక్కువగా తినడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే పుచ్చకాయ కాకుండా ఇంకొకటి కూడా వేసవి తాపాన్ని తీరుస్తుంది. అదే తాటి ముంజు. ఇది డీహైడ్రేషన్, అలసట లేకుండా చేస్తుంది.

ఒకప్పుడు ఇవి గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో ఎక్కువుగా దొరికేవి.. అయితే ఇప్పుడు పట్టణాలలో కూడా కొంతమంది వీటిని అమ్ముతున్నారు. ఈ తాటి ముంజు రుచి రుచి ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తాయి. వేసవిలో ఎక్కువగా వచ్చే డీ హైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలతో ఇబ్బందిపడేవారికి తాటి ముంజులు మంచి ఔషదం. అంతేకాదు వీటిల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి .

మృదువుగా.. ముట్టుకుంటే జారిపోయేంత సున్నింతగా ఉండే ఈ ముంజలను అలా నోట్లో పెట్టుకుంటే చాలు.. చల్లగా కడుపులోకి జారుకుంటాయి అందుకే వీటిని ‘ఐస్ యాపిల్స్’ అని కూడా అంటారు. ఈ ముంజుల్లో విటమిన్‌ ఏ, బీ, సీ, ఐరన్‌, కాల్షియంతోపాటు బి కాంప్లెక్స్, నియాసిస్, రిబో ప్లెవీస్, దయామిన్, జింకు పాస్పరస్, పొటాషియం తదితర పోషకాలు కూడా ఉంటాయి. కాలేయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ముంజుల్లోని పొటాషియం శరీరంలో ఉండే విష పదార్ధాలను తొలగిస్తాయి.

అయితే లేత తాటిముంజెలు తింటుంటే వాటిపై ఉండే తొక్కను తొలగించకుండా తినేయండి.. అందులో ఎన్నో పోశాలున్నాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ముంజులు ఎంతో ఉపయోగపడతాయి. జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారికి ఇవి మేలు చేస్తాయి. ఇక ఇవి బరువును అదుపులో ఉంచుతాయి. పిల్లలకు వృద్ధులకు కూడా అత్యంత మేలు చేస్తాయి ఈ తాటి ముంజులు.

వేసవిలో వచ్చే చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. దద్దుర్లు, కాలిన గాయాలు, చేమట కాయలు ఏర్పడినట్లతే తాటి ముంజుల గుజ్జుని శరీరానికి పట్టించి చూడండి. కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి.శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తుంది. ఎండల్లో దాహార్తిని తీరుస్తాయి. వడదెబ్బ తగిలినవాళ్లకు ముంజులను జ్యూస్‌గా చేసి పట్టిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుందని, ఇవి బీపీని అదుపు చేయడమే కాకుండా కొవ్వును అదుపులో ఉంచుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎముకులను బలంగా ఉంచేందుకు, వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ముంజులు చాలా మంచివట. తాటి ముంజుల మధ్యలో స్వచ్ఛమైన, రుచికరమైన నీరు ఉంటుంది. ఆ నీరు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే క్యాన్సర్ కణాల నిరోధానికీ ముంజులు ఉపయోగపడతాయి, రొమ్ము క్యాన్సర్‌కు కారణమయ్యే పెట్రో కెమికల్స్, ఆంథోసైనిన్‌లను నిర్మూలిస్తాయి. అజీర్తి, ఎసిడిటీ సమస్యలను తాటి ముంజెలు దూరం చేస్తాయి. కనుక పల్లెల్లోనే కాదు.. ప్రస్తుతం పట్టణాల్లో కూడా దొరుకుంటున్న తాటి ముంజెలను అందరూ తినండి.. వేసవిలో వచ్చే వ్యాధులకు దూరంగా ఉండండి.

Also Read:

 ఇక రైలు ప్రయాణం బోర్‌ కొట్టదు.. ఎంజాయ్‌ చేస్తూ జర్నీ చేయొచ్చు.. అందుబాటులోకి కొత్త సేవ..

ఈ యోగాసనానికి 10 నిముషాలు కేటాయిస్తే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, విటమిన్ ‘డి’ లభ్యం