AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Pickle Recipe : క్షణాల్లో చిన్నఉల్లిపాయ ఊరగాయ రెడీ .. కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం తెలుసుకుందాం..!

తినే సమయంలో భోజన పళ్లెం ముందు ఎన్ని ఆహార పదార్ధాలున్నా.. ఊరగాయ కోసం వెదుకుతాం. వెజ్, నాన్ వెజ్ ప్రియులు కూడా ఈ పచ్చళ్లకు ఫ్యాన్స్.. అయితే ఒకప్పుడు ఆవకాయ, మాగాయ ఉసిరికాయ అంటూ ఏడాదికి సరిపడా.. నిల్వ ఉండే ఊరగాయలను వేసవిలో...

Onion Pickle Recipe : క్షణాల్లో చిన్నఉల్లిపాయ ఊరగాయ రెడీ .. కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం తెలుసుకుందాం..!
Surya Kala
|

Updated on: Mar 05, 2021 | 12:37 PM

Share

Onion Pickle Recipe : తినే సమయంలో భోజన పళ్లెం ముందు ఎన్ని ఆహార పదార్ధాలున్నా.. ఊరగాయ కోసం వెదుకుతాం. వెజ్, నాన్ వెజ్ ప్రియులు కూడా ఈ పచ్చళ్లకు ఫ్యాన్స్.. అయితే ఒకప్పుడు ఆవకాయ, మాగాయ ఉసిరికాయ అంటూ ఏడాదికి సరిపడా.. నిల్వ ఉండే ఊరగాయలను వేసవిలో పెద్దవారు పెట్టేవారు.. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పులతో.. నేటి తరానికి అప్పటిలా ఊరగాయలు ట్టె ఓపిక తీరిక రెండు లేవు.. దీంతో అప్పటి కప్పుడు ఒక పచ్చడిని రెడీ చేసుకుని తిని ఎంజాయ్ చెయ్యాలని కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఈరోజు మనం చిన్న ఉల్లిపాయతో ఊరగాయ పెట్టడం తెలుసుకుందాం..

చిన్నఉల్లిపాయ ఊరగాయకు కావాల్సిన పదార్ధాలు :

సాంబార్ ఉల్లిపాయలు (వీలయినంత చిన్న ఉల్లిపాయలు) 1/2 కేజీ వేరుశనగ నూనె ఉప్పు చింతపండు గుజ్జు పసుపు కారం ( ఒక కప్పు) మెంతి పిండి ఆవపొడి (రెండు స్పూన్లు) పోపుకి ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ

తయారీ విధానం :

ఉరగాయకు వీలయినంత చిన్న ఉల్లిపాయలు తీసుకుని వలిచి నీడలో ఆరనివ్వాలి. తడిలేకుండా బాగా ఆరడానికి వాటిని ఒక శుభ్రమైన బట్టపై మూడు గంటల సేపు వదిలేయ్యాలి. తర్వాత ఒక వెడల్పాటి పాన్ తీసుకుని గ్యాస్ సోటివ్ మీద పెట్టి కొంచెం వేడి ఎక్కిన తర్వాత అరకప్పు నూనె వేసుకుని దానిలో ఎండబెట్టిన ఉల్లిపాయలని వేసి తగినంత ఉప్పు వేసి మూతపెట్టి, సన్నని సెగ మీద మగ్గనివ్వాలి. మగ్గాక రెండు స్పూన్లు చింతపండు గుజ్జు వేసి, పసుపు, కొంచెం నీరుపోసి (అవసరం అనుకుంటే) ఉడకనివ్వాలి. లేదా నూనెలలోనే మగ్గించుకోవచ్చు

ఇలా ఉడికిన తర్వాత దానిలో ఒక కప్పు కారం, మెంతి పిండి, రెండు స్పూన్ల ఆవపొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రుచి చూసుకుని ఉప్పు . పులుపు ని నచ్చే విధంగా వేసుకోవాలి. అనంతరం ఈ పాన్ ను పక్కన పెట్టుకోవాలి.

ఊరగాయకి అదనంగా మంచి రుచి కోసం కొద్దిగా నూనెలో ఆవాలు,ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. రెండు మూడు గంటలు తర్వాత ఈ ఊరగాయ తినడానికి రెడీ అవుతుంది. తడి తగలకుండా ఉంచితే నెలరోజులపటు చిన్నఉల్లిపాయ ఊరగాయ నిల్వ ఉంటుంది.

Also Read:

స్టార్ యాక్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. క్షమాపణ కోరిన నటుడు..చివరకు

 ఐస్ యాపిల్స్ ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా వదలురుగా..!