Actor Kim Ji-Soo : స్టార్ యాక్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. క్షమాపణ కోరిన నటుడు..చివరకు
దక్షిణ కొరియా నటుడు కిమ్ జి సూ ప్రస్తుతం రివర్ వేర్ ది మూన్ రైజెస్ అనే సాగేక్ డ్రామాలో నటిస్తున్నాడు, మనోడికి ఫాలోయింగ్ కూడా మాములుగా లేదు. అయితే ఇప్పుడు కిమ్ జి సూపై ఓ యువతి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.
Kim Ji-Soo : దక్షిణ కొరియా నటుడు కిమ్ జి సూ ప్రస్తుతం రివర్ వేర్ ది మూన్ రైజెస్ అనే సాగేక్ డ్రామాలో నటిస్తున్నాడు, మనోడికి ఫాలోయింగ్ కూడా మాములుగా ఉండదు. అయితే ఇప్పుడు కిమ్ జి సూపై ఓ యువతి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఆ యువతి ఎవరో కాదు కిమ్ జి సూ క్లాస్‌మెట్. 2006-2008 సమయంలో సియోరాబియోల్ మిడిల్ స్కూల్ లో జి సూ చదివాడు. ఆసమయంలో అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని చెప్పుకొచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ఆపోస్టు లో జి సూ గురించి రాసుకొచ్చింది.
స్కూల్ లో చదివే సమయంలో జి సూ అక్కడ చదివే వారికంటే వయసులో కొంచం పెద్దవాడు. దాంతో అతడు ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించే వాడని, లైంగికంగా వేధించేవాడని తెలిపింది. అంతే కాదు అతను ఒక ‘ఉమెనైజర్’ అని ఆరోపించింది. అప్పుడే అతడు ఒక రౌడీ లా గ్యాంగ్ స్టార్ లా ప్రవర్తించేవాడని అంది. అలాగే ఒక విద్యార్థితో బాత్ రూమ్ లో సంభోగం చేశాడని ఆరోపించింది. అంతే కాదు చాలా మంది తన స్కూల్ మేట్స్ అతనిపై ఇదే రకం ఆరోపణలు చేసారు. దాంతో జి సూ చెందిన ఏజెన్సీ కీయాస్ట్ ఎంటర్టైన్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై వారు దర్యాప్తు చేస్తున్నారని, కొంత సమయం అవసరమని ఆ ప్రకటన పేర్కొంది. ఈ వాస్తవాలను ధృవీకరించడానికి తాము ప్రయత్నం చేస్తామని వారు తెలిపారు. తమ సినిమానుంచి కూడా జి సూని తొలగించాలని చూస్తున్నామని, దీనిపై చర్చ జరుగుతుందని తెలిపారు. ఇక ఈ వివాదం పై స్పంధించిన జి సూ క్షమాపణలు కోరుతూ ఓ లేఖను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు లేఖ.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్.!