Health Tips: ఏదైనా తిన్న వెంటనే టీ, కాఫీ తాగుతున్నారా..? అయితే, ముందు ఇది చదవండి.. మీ కోసమే…!

|

Feb 23, 2024 | 7:00 PM

అయితే టీ, కాఫీలు విచక్షణారహితంగా తాగడం ఆరోగ్యానికి మంచి అలవాటు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం నిద్రలేచిన ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం కూడా ఆరోగ్యానికి హానికరం. నిజం చెప్పాలంటే చాలా మంది ఈ అలవాట్ల నుంచి అంత తేలిగ్గా బయటపడలేకపోతుంటారు. ఇదిలా ఉంటే, చాలా మంది ప్రజలు ఉదయం, సాయంత్రం రెండు పూటల భోజనం తిన్న వెంటనే టీ, లేదా కాఫీని తాగుతుంటారు. ఇది చాలా హానికరమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Health Tips: ఏదైనా తిన్న వెంటనే టీ, కాఫీ తాగుతున్నారా..? అయితే, ముందు ఇది చదవండి.. మీ కోసమే…!
Tea
Follow us on

టీ, కాఫీలు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కేఫిన్‌ పానీయాలు. పొద్దున్నే టీ, కాఫీలు తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదు.. కొందరైతే.. రోజుకు మూడు, నాలుగైదు సార్లు కూడా తాగుతుంటారు. మన రోడ్ల పక్కన, వీధి చివరన ఎక్కడ పడితే అక్కడ అనేక టీ స్టాల్స్ దీనికి నిదర్శనం. అయితే టీ, కాఫీలు విచక్షణారహితంగా తాగడం ఆరోగ్యానికి మంచి అలవాటు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం నిద్రలేచిన ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం కూడా ఆరోగ్యానికి హానికరం. నిజం చెప్పాలంటే చాలా మంది ఈ అలవాట్ల నుంచి అంత తేలిగ్గా బయటపడలేకపోతుంటారు.

ఇదిలా ఉంటే, చాలా మంది ప్రజలు ఉదయం, సాయంత్రం రెండు పూటల భోజనం తిన్న వెంటనే టీ, లేదా కాఫీని తాగుతుంటారు. ఇది చాలా హానికరమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీని తీసుకుంటే, శరీరం ఆహారం నుండి అవసరమైన పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా ఇనుము శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. టీ మరియు కాఫీలలో ఉండే పాలీఫెనాల్స్, టానిన్లు అనే సమ్మేళనాలు దీనికి కారణం అంటున్నారు పోషకాహార నిపుణులు.

తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగుతున్నట్టయితే.. మనం తినే ఆహారంలోని నిజమైన ప్రయోజనాలను మనం కోల్పోతాము. ఇది సాధారణ అలవాటు అనుకుంటే.. దాని వల్ల మనకు కలిగే నష్టాన్ని ఆలోచించండి. ఇది తీవ్రమైన ఐరన్‌ లోపానికి దారితీస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా సాధారణంగా భారతదేశంలో ప్రబలంగా ఉంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి అలవాట్లు కూడా మహిళల్లో రక్తహీనతకు కారణం అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..