మన భారతీయ వంటశాలలోని అనేక పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోపు దినుసుల నుంచి సువాసనకు అవసరమైన కరివేపాకుల వరకు అన్ని మన ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే అందులో కొన్నింటిని తినే సమయంలో పక్కన పెట్టేస్తుంటాం. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలను మనం దూరం చేసుకన్నట్లే. అందులో ముఖ్యంగా కరివేపాకు. వంటకు రుచి, సువాసనకు మాత్రమే కాదు… ఆరోగ్యానికి పోషకాహారం కూడా. దీనిని పురాతన కాలం నుంచి మన వంటకాలలో ఉపయోగిస్తుంటారు. కరివేపాకుతో కలిగే ప్రయోజనాల గురించి ప్రముఖ నిపుణులు పూజా మఖిజా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
కరివేపాకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ డయాబెటిక్, యాంటీ డైజెంటరీ, జీర్ణ, కార్మినేటివ్ లక్షణాలున్నాయి. అంతేకాకుండా.. ఇందులో తక్కువ కొలెస్ట్రాల్, మెరుగైన కంటిచూపు, రక్తహీనత తగ్గించే లక్షణాలు, గుండె ఆరోగ్యం, దంతాల ఆరోగ్యానికి కరివేపాకు ఉపయోగపడుతుంది.
కరివేపాకును ఎలా తీసుకోవాలి…
1. ఒక గ్లాసు కూరగాయల రసానికి 8-10 కరివేపాకులు వేసి రోజూ తాగాలి. ఇందులో విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. యాంటీ ఆక్సిడెంట్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. మొటిమలను తగ్గించడంలోనూ సహయపడుతుంది.
2. ఈ ఆకులను ఎండలో ఆరబెట్టి.. పొడిగా చేసుకోవాలి. దానిని ఒక కూజాలో గాలి చోరబడకుండా.. భద్రంగా నిల్వచేయాలి. దీనిని 1/4 టీస్పూన్ ను గర్భధారణ సమయంలో అనారోగ్యం, వికారం తగ్గేందుకు సహాయపడుతుంది.
3. అంతేకాదు.. కరివేపాకు జుట్టు, చర్మం ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్టాల్ ను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
ట్వీట్..
National Doctor’s Day: సాయి పల్లవి.. అజ్మల్ అమీర్ సహా నిజ జీవితంలో డాక్టర్స్ అయిన స్టార్స్..