Mutton Keema Curry: టేస్టీ టేస్టీ మటన్ కీమా రెసిపీ మీ కోసం.. అన్నం, చపాతీతో కీమా కూర కాంబో అదిరిపోతుంది..

నాన్ వెజ్ ప్రియుల్లో మటన్ ని అత్యంత ఇష్టంగా తినేవారున్నారు. కొంత మంది గొర్రె మాంసాన్ని మరికొంత మంది మేక మాంసాన్ని తింటారు. ఇది ప్రోటీన్ , విటమిన్ బి12 వంటి పోషకాలను కలిగి ఉంటుంది. ఈ మటన్ తో కూర, వేపుడు వంటి కూరలతో పాటు బిర్యానీ కూడా చేసుకుంటారు. అంతేకాదు మటన్ ని కీమా కర్రీని చేసుకుంటారు. రోటీ లేదా అన్నంతో మటన్ కీమా తినడం మీకు ఇష్టమా.. ఈ రోజు టేస్టీ టేస్టీ మటన్ కీమా రెసిపీ తెలుసుకుందాం..

Mutton Keema Curry: టేస్టీ టేస్టీ మటన్ కీమా రెసిపీ మీ కోసం.. అన్నం, చపాతీతో కీమా కూర కాంబో అదిరిపోతుంది..
Mutton Keema Curry

Updated on: Aug 28, 2025 | 4:37 PM

భారతీయులు భోజన ప్రియులు. తినడానికి రకరకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి. అది వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా రుచికి కొరత ఉండదు. నాన్ వెజ్ గురించి చెప్పాలంటే మటన్ ఎక్కువగా తింటారు. మటన్ కర్రీ నుండి మటన్ కీమా వరకు, ప్రతిదీ చాలా రుచికరమైన వంటకం. కీమా కూరని అందరూ తినడానికి ఇష్టపడతారు. మధ్యాహ్నం భోజనం లేదా రాత్రి భోజనం అయినా మటన్ కీమా వంటకం రోటీ, పరాఠా, నాన్ లేదా అన్నంతో ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ప్రత్యేకత ఏమిటంటే దీన్ని తయారు చేయడం అంత కష్టం కాదు. మీరు కూడా రుచికరంగా మటన్ కీమా తయారు చేయాలనుకుంటే సింపుల్ గా చేసుకోండి. రెసిపీ ఏమిటంటే..

మటన్ కీమా తయారీకి కావలసిన పదార్థాలు:

  1. మటన్ కీమా- 500 గ్రాములు
  2. ఉల్లిపాయలు- 2 రెండు మీడియం సైజు (సన్నగా తరిగినవి)
  3. టమోటాలు-2 మీడియం సైజు (సన్నగా తరిగినవి)
  4. అల్లం-వెల్లుల్లి పేస్ట్- రెండు టీస్పూన్లు
  5. ఇవి కూడా చదవండి
  6. పచ్చి మిరపకాయలు- 4 సన్నగా తరిగినవి
  7. పెరుగు- అర కప్పు
  8. పసుపు- అర టీస్పూన్
  9. కారం- ఒక టీస్పూన్
  10. ధనియాల పొడి-ఒక టేబుల్ స్పూన్
  11. గరం మసాలా- అర టీస్పూన్
  12. యాలకులు- 2,
  13. బే ఆకు-1
  14. మిరియాలు- 4
  15. దాల్చిన చెక్క – చిన్న ముక్క
  16. నూనె- కూరకు కావలసినంత
  17. ఉప్పు- రుచికి సరిపడా
  18. కొత్తిమీర- కొంచెం కట్ చేసినది

తయారీ విధానం:

  1. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి.. నూనె వేసి వేడి చేయండి. తర్వాత మొత్తం మసాలా దినుసులు (యాలకులు, బే ఆకులు, మిరియాలు, దాల్చిన చెక్క) వేసి వేయించండి. కమ్మటి వాసన రావడం ప్రారంభించిన వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
  2. ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి కొన్ని నిమిషాలు వేయించాలి.
  3. ఇప్పుడు తరిగిన టమోటాలు వేసి ఉడికించండి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి, నూనె పక్కల నుంచి వేరు అయ్యే వరకు మసాలా దినుసులను వేయించాలి.
  4. ఇప్పుడు ఈ మిశ్రమంలో మటన్ కీమాని వేసి బాగా కలిపి 10 నిమిషాలు వేయించండి. మాంసపు పచ్చి వాసన పోయే వరకూ వేయించండి.
  5. తరువాత ఈ మిశ్రమంలో పెరుగు వేసి బాగా కలిపి తక్కువ మంట మీద ఉడికించాలి.
  6. ఈ మటన్ మిశ్రమంలో ఒక గ్లాసు నీరు పోసి మూతపెట్టి మాంసం మెత్తబడే వరకు, సుగంధ ద్రవ్యాల రుచి మటన్ కి పట్టే వరకూ ఉడికించండి.
  7. కూరపై నూనె తేలిన తర్వాత గరం మసాలా వేసి బాగా కలపండి. పైన కొత్తిమీరతో అలంకరించండి.
  8. అంతే వేడి వేడి మటన్ కీమా సిద్ధం. దీన్ని రోటీ, పరాఠా, నాన్ లేదా బిర్యానీ, అన్నం తో వడ్డించవచ్చు.
  9. కూర తయారీకి చిట్కాలు:
  10. కీమా మాంసాన్ని ఎల్లప్పుడూ నూనె లో బాగా వేయించాలి. తద్వారా దాని నిజమైన రుచి బయటకు వస్తుంది.
  11. ఇష్టపడే వారు బఠానీలను కూడా జోడించవచ్చు, ఇది రుచిని మరింత పెంచుతుంది.
  12. పెరుగుకు బదులుగా టమోటా ప్యూరీని కూడా ఉపయోగించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..