
వర్షం మొదలవగానే వేడి వేడి టీ.. దాని పక్కన కరకరలాడే స్నాక్స్ గుర్తొస్తాయి. అలాంటి సాయంత్రాలకు పొటాటో రోస్టీ ఒక బెస్ట్ ఆప్షన్. బంగాళాదుంపల తియ్యటి రుచి, మొక్కజొన్న ఫ్లేవర్, మిరపకాయల కారం అన్నీ కలిసి ఈ స్నాక్‌ను మరింత స్పెషల్‌గా మారుస్తాయి. అంతేకాకుండా.. దీని తయారీకి ఎక్కువ సమయం పట్టదు. పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ రోస్టీని వేడి టీ లేదా కాఫీతో తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో మీరు కూడా దీన్ని ప్రయత్నించి ఆ అనుభూతిని ఆస్వాదించండి.
ముందుగా బంగాళాదుంపల తొక్క తీసి తురుముకుని ఒక ముస్లిన్ బట్టలో వేసి అదనపు నీటిని పిండేయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఈ బంగాళాదుంప తురుము, మొక్కజొన్న, సోయా సాస్, ఉల్లికాడలు, అల్లం, వెల్లుల్లి, వైట్ పెప్పర్, చక్కెర, చిల్లీ ఫ్లేక్స్, నువ్వుల నూనె, నల్ల నువ్వులు, బియ్యపు పిండి వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఒక పాన్ ను వేడి చేసి కొద్దిగా నూనె రాయాలి. మిశ్రమం నుండి చిన్న ముద్దలు తీసుకుని వాటిని కొద్దిగా ఒత్తి పాన్‌పై ఉంచాలి. మధ్య మంటపై రెండు వైపులా బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు వేయించాలి.
చివరిగా వేడి వేడి పొటాటో రోస్టీని టొమాటో కెచప్ లేదా మీకు నచ్చిన డిప్‌తో సర్వ్ చేయండి. ఈ వర్షాకాలంలో ఈ స్పెషల్ స్నాక్‌ను మీ కుటుంబం, స్నేహితులతో ఆస్వాదించండి.