AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలం స్పెషల్ స్నాక్ రెసిపీ మీకోసం..! నోట్లో కరిగిపోయే స్వీట్ కార్న్ ధోక్లా ఎలా తయారు చేయాలో తెలుసా..?

వర్షం పడుతుంటే వేడి వేడి టీతో కరెక్ట్‌ గా సరిపోయే స్నాక్ కోసం వెతుకుతున్నారా..? అయితే ఈ స్వీట్ కార్న్ ధోక్లా రెసిపీ మీకోసమే. రవ్వ, కార్న్, మసాలాలతో ఆవిరి మీద తయారయ్యే ఈ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ధోక్లా రుచికి మించి ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. వర్షపు సాయంత్రాల్లో దీన్ని తప్పక ట్రై చేయండి.

వర్షాకాలం స్పెషల్ స్నాక్ రెసిపీ మీకోసం..! నోట్లో కరిగిపోయే స్వీట్ కార్న్ ధోక్లా ఎలా తయారు చేయాలో తెలుసా..?
Sweet Corn Dhokla Recipe
Prashanthi V
|

Updated on: Aug 11, 2025 | 6:12 PM

Share

మాన్‌సూన్ స్పెషల్‌ గా స్వీట్ కార్న్ ధోక్లా అదిరిపోతుంది. రొటీన్ స్నాక్స్‌తో బోర్ కొట్టి ఉంటే.. నోట్లో కరిగిపోయే ఈ ధోక్లా ట్రై చేయండి. కార్న్ పేస్ట్, రవ్వ, మసాలాలతో ఆవిరి మీద తయారయ్యే ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కొత్తిమీర చట్నీ, వేడి వేడి చాయ్‌తో తింటే ఆ మజానే వేరు. సులభంగా చేసుకునే ఈ రెసిపీని మీ ఇంట్లో వాళ్లకు చేసి పెట్టి మెప్పు పొందండి.

రెసిపీకి కావాల్సిన పదార్థాలు

  • రవ్వ – 1 కప్పు
  • పుల్లటి పెరుగు – 1/2 కప్పు
  • నీళ్లు – 3/4 కప్పు
  • చక్కెర – 1/2 టీ స్పూన్
  • ఉప్పు – టేస్ట్‌కి సరిపడా
  • స్వీట్ కార్న్ – 1.5 కప్పులు
  • అల్లం – 1 టీ స్పూన్
  • పచ్చిమిర్చి – 3
  • పసుపు – 1/2 టీ స్పూన్
  • రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – 1/2 టీ స్పూన్
  • ఒరేగానో – 1/2 టీ స్పూన్
  • పల్లినూనె – 1 టేబుల్ స్పూన్
  • బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్
  • నీళ్లు – 1 టీ స్పూన్

తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు

  • పల్లినూనె – 2 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు – 2 టీ స్పూన్లు
  • పచ్చిమిర్చి – 4
  • ఇంగువ – 1/2 టీ స్పూన్
  • కరివేపాకు – 1 రెమ్మ

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో రవ్వ, పుల్లటి పెరుగు, నీళ్లు, చక్కెర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 20 నిమిషాలు పక్కన ఉంచాలి. ఈలోపు స్వీట్ కార్న్‌ ను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ మిశ్రమంలో ఈ కార్న్ పేస్ట్, పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో, నూనె వేసి కలపాలి.

ఒక ప్లేట్ లేదా ట్రేకు నూనె రాసి ఇడ్లీ స్టాండ్ లేదా స్టీమర్‌లో ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. ధోక్లా పిండిలో బేకింగ్ సోడా వేసి కలిపి నూనె రాసిన ప్లేట్‌లో పోసి హై ఫ్లేమ్‌పై 20 నిమిషాలు ఆవిరిలో ఉడికించాలి. ధోక్లా ఉడికేలోపు ఒక చిన్న పాన్‌లో నూనె వేసి ఆవాలు, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు తయారు చేయాలి.

చివరిగా ఉడికిన ధోక్లాపై ఈ తాలింపు వేసి నచ్చిన ఆకారాల్లో కట్ చేసి వేడివేడిగా కొత్తిమీర చట్నీతో వడ్డించాలి. ఈ ఈజీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ ధోక్లాను మీరు కూడా ట్రై చేసి ఈ మాన్‌సూన్‌ను ఎంజాయ్ చేయండి.