Mediterranean Diet: ప్రపంచంలోని అత్యుత్తమ డైట్‌ ఇదే.. ‘మెడిటెరేనియన్‌’ పాటిస్తే యవ్వనంగా ఉండొచ్చు..

|

Jan 12, 2022 | 1:12 PM

Mediterranean top-ranked diet: వరుసగా ఐదో ఏడాది కూడా ప్రపంచ అత్యుత్తమ డైట్‌గా మెడిటెరేనియన్‌ డైట్‌ ఎంపికైంది. వివిధ డైట్లను పరిశీలించి

Mediterranean Diet: ప్రపంచంలోని అత్యుత్తమ డైట్‌ ఇదే.. ‘మెడిటెరేనియన్‌’ పాటిస్తే యవ్వనంగా ఉండొచ్చు..
Mediterranean Diet
Follow us on

Mediterranean top-ranked diet: వరుసగా ఐదో ఏడాది కూడా ప్రపంచ అత్యుత్తమ డైట్‌గా మెడిటెరేనియన్‌ డైట్‌ ఎంపికైంది. వివిధ డైట్లను పరిశీలించి ప్రతి ఏటా అత్యుత్తమ డైట్‌ ఎంపిక చేసే యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ దీని గురించి వెల్లడించింది. ఈ మెడిటెరేనియన్‌ డైట్‌ (Mediterranean diet) తో చాలా ప్రయోజనాలున్నాయని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. మధుమేహం, జ్క్షాపకశక్తిని కోల్పోవడం, రొమ్ము క్యాన్సర్‌, గుండెపోటు వంటి తీవ్ర వ్యాధులను ఈ డైట్‌ నిరోధిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే వేగంగా బరువు తగ్గడం, యవ్వనంగా ఉంచడంలో ఈ డైట్‌ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు. అందుకే వరుసగా ఐదో ఏడాది కూడా మెడిటేరెనియన్ డైట్ (Diet) నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంందని పేర్కొంటున్నారు. దీనివల్ల సైట్ ఎఫెక్ట్స్ కూడా తక్కువని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు.

ఏమిటీ డైట్ ప్లాన్‌…?
మెడిటెరేనియన్‌ డైట్‌ అనేది మొక్కల ఆధారిత ఆహారం. ఈ డైట్‌లో పండ్లు, కూరగాయలపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, విత్తనాలు ఈ డైట్‌లో చేర్చారు. పచ్చి ఆలివ్‌ నూనెను కొవ్వుగా ఉపయోగిస్తారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉండే చేపలను ఎక్కువగా తింటారు. చక్కెర, రెడ్ మీట్, గుడ్లు, చికెన్, టర్కీ చికెన్‌, పాల ఉత్పత్తులను చాలా తక్కువగా ఉపయోగిస్తారు. శుద్ది చేసిన నూనె, ప్రాసెస్‌ చేసిన ఆహారాలు తీసుకోవడం ఈ డైట్‌లో నిషేధం. పరిమిత పరిమాణంలో ఆల్కాహాల్‌ తీసుకోవడానికి అనుమతి ఉంటుంది

మెడిటరేనియన్‌ డైట్‌ ప్రయోజనాలు..
గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. మెడిటెరేనియన్‌ ఆహారం తీసుకోవడం వల్ల గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తక్కువని నిపుణులు పేర్కొంటున్నారు.

డిప్రెషన్‌..
ఇతర వ్యక్తులతో పోల్చుకుంటే ఈ ఆహారం తీసుకున్న వ్యక్తులు 33 శాతం తక్కువ డిప్రెషన్‌కు గురవుతారని శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

మానసిక వ్యాధులు దూరం, జ్ఞాపకశక్తి పెరుగుదల..
ఈ డైట్‌ను ఫాలో అయ్యేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
మెదడుపై సానుకకూల ప్రభావం చూపడం వల్ల మనసుకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి
అల్జీమర్స్‌ ముప్పు కూడా తగ్గుతుంది
జ్ఞాపకశక్తి తగ్గడం, మానసిక వ్యాధుల నుంచి రక్షణకు ఈ డైట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది

ఎక్కువ కాలం జీవించవచ్చు..
ఈ డైట్‌ తీసుకుంటే మనిషి ఎక్కువ కాలం జీవించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఈ డైట్‌తో ఎక్కువ వ్యాధులు రాకుండా ఉండటం వల్ల మనిషి జీవితకాలం పెరుగుతుందంటున్నారు.
దీనిలో ఉండే పోషకాలు ఎముకల జీవక్రియను పెంచడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి
స్త్రీలలో కూడా ఎముకలు బలంగా తయారవడంలో ఈ డైట్‌ సహాయపడుతుంది

అదుపులో మధుమేహం..
డయాబెటిస్‌ ఉన్నవారికి ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది.
మెడిటరేనియన్‌ డైట్‌తో టైప్‌ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

రొమ్ము క్యాన్సర్‌కు..
ఈ ఆహారం తీసుకున్నవారికి రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 40 శాతం తక్కువని నిపుణులు పేర్కంటున్నారు.

కంటినిండా నిద్ర..
ఇటీవల కాలంలో చాలామందికి కంటినిండా నిద్ర పట్టడంలేదని అనేక సర్వేలలో తేలింది. మెడిటరేనియన్‌ డైట్‌తో వృద్దులు సహా అందరికీ కంటినిండా ప్రశాంతంగా నిద్ర పడుతుందని పేర్కొంటున్నారు నిపుణులు.

బరువుతోపాటు..
ఈ ప్రయోజనాలతోపాటు, అంగస్తంభన లోపం పోగొట్టుకోవడానికి, వేగంగా బరువు తగ్గడానికి ఈ డైట్‌ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

Also Read:

Goosebumps Reasons: శరీరంపై వెంట్రుకలు ఎందుకు నిక్కబొడుస్తాయో తెలుసా..? ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి

Eyes: చలికాలంలో కళ్లు జాగ్రత్త.. పట్టించుకోకపోతే ఈ సమస్యలు తప్పవు.. అవేంటంటే..?