Meal Maker Manchurian: మీల్ మేకర్ మంచురియాని ఇలా చేసి పెట్టండి.. పిల్లలు పెద్దలు ఇష్టంగా లాగించేస్తారు..

భారతీయులు భోజన ప్రియులు. రకరకాల ఆహార పదార్దాలను ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు సాంప్రదాయ ఆహారానికి వెస్ట్రన్ స్టైల్ ని జత చేసి సరికొత్త ఆహారపదార్దాలను కూడా సృష్టిస్తారు. అలా ఎక్కువగా ఫేమస్ అయ్యాయి ఇండో-చైనీస్ వంటలు. న్యుడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ వంటి చైనా వంటలకు భారతీయుల రుచులని కలిపి సరికొత్త ఆహారాన్ని తయారు చేస్తున్నారు. మంచురియా లో వెజ్, నాన్ వెజ్ కూడా ఉన్నాయి. ఈ రోజు మీల్ మేకర్ తో మంచిరియా తయారీ తెలుసుకుందాం..

Meal Maker Manchurian: మీల్ మేకర్ మంచురియాని ఇలా చేసి పెట్టండి.. పిల్లలు పెద్దలు ఇష్టంగా లాగించేస్తారు..
Meal Maker Manchurian

Updated on: May 08, 2025 | 9:57 PM

సోయాతో చేసే మీల్ మేకర్ తో రకరకాల వంటకాలతో పాటు మీల్ మేకర్ పకోడీ వంటి స్నాక్స్ ని కూడా తయారు చేస్తారు. అయితే ఈ మీల్ మేకర్ తో మంచురియా కూడా చేసుకోవచ్చు అని కొంతమందికి మాత్రమే తెలుసు. ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఉండే ఈ మీల్ మేకర్ మంచురియాని తక్కువ సమయంలోనే టేస్టీగా చేసుకోవచ్చు. దీనిని అలాగే చిరు తిండిగా తినవచ్చు.. లేదా ఫ్రైడ్ రైస్, నూడుల్స్‌తో కలిపి ఆస్వాదింవచ్చు.

కావలసిన పదార్థాలు

మీల్ మేకర్ – రెండు కప్పులు

అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను

ఇవి కూడా చదవండి

ఉల్లికాడల తరుగు – రెండు స్పూన్లు

పచ్చిమిర్చి – నాలుగు

వెల్లుల్లి – అర స్పూను ముక్కలు

అల్లం – అర స్పూను ముక్కలు

కార్న్ ఫ్లోర్ – మూడు స్పూన్లు

మైదా పిండి – రెండు స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

షెజ్వాన్ సాస్ – ఒక స్పూను

సోయాసాస్ – ఒక స్పూను

టమోటో సాస్ – రెండు స్పూన్లు

మిరియాల పొడి – అర స్పూను

వెనిగర్ – ఒక స్పూను

నూనె – వేయించడానికి సరిపడా

కొత్తిమీర –

నిమ్మ కాయ

నీళ్లు – కావలసినంత

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకుని మీల్ మేకర్ల వేసి తగినంత నీరు పోసి కొంచెం ఉప్పు వేసి రెండు నిముషాలు ఉడికించాలి. తర్వాత వీటిని వేడి నీటి నుంచి తీసి .. పక్కకు పెట్టుకుని.. కొంచెం చల్లారిన తర్వాత నీరు లేకుండా మీల్ మేకర్లను పిండుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మిల్ మేకరస్ ను వేసుకుని కొంచెం ఉప్పు షెజ్వాన్ సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, సోయా సాస్ వేసి.. మీల్ మేకర్స్ ను బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసిన మిల్ మేకర్లను వేసి వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో నీరు కార్న్ ప్లోర్ పిండి వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే పాన్ పెట్టి కొంచెం నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత అల్లం తరుగు వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఇప్పుడు కట్ చేసిన పచ్చి మిర్చి, ఉల్లికాడల ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసి కలిపి.. తర్వాత షెజ్వాన్ సాస్, టమాటో కెచప్, సోయాసాస్, కొంచెం వెనిగర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ నీళ్లను వేసి బాగా కలిపి మరుగుతున్న సమయంలో వేయించి పెట్టుకున్న మీల్ మేకర్లను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం బాగా దగ్గర అయ్యేవరకూ స్విమ్ లో పెట్టి వేయించండి. చివరగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒక ప్లేట్ లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ పెట్టి సర్వ్ చేయండి. దీనిని పిల్లలకు పెద్దలకు కూడా బాగా ఇష్టంగా తింటారు. మరి వీలయితే ఒక సారి ట్రై చేయండి..

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..