AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Diet: బరువు తగ్గడానికి డైట్ చేస్తున్నారా.. పొరపాటున కూడా ఈ పండ్లు తినొద్దు..

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అధిక బరువు ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో బరువు తగ్గేందుకు తినే ఆహారం విషయంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. స్పెషల్ డైట్ ని ఫాలో అవుతారు. డైట్ లో పండ్లు తినడం ఆరోగ్యకరమైనదని భావిస్తారు. అయితే అన్ని రకాల పండ్లు బరువు తగ్గడానికి ఉపయోగపడవు. డైటింగ్ చేస్తున్నప్పుడు మీ డైట్‌లో ఏ పండ్లను చేర్చుకోకూడదో ఈ రోజు తెలుసుకుందాం..

Weight Loss Diet: బరువు తగ్గడానికి డైట్ చేస్తున్నారా.. పొరపాటున కూడా ఈ పండ్లు తినొద్దు..
Weight Loss Diet
Surya Kala
|

Updated on: May 08, 2025 | 9:23 PM

Share

బరువు తగ్గడానికి డైటింగ్ ప్రారంభించినప్పుడు మొదట తినే ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్ధాలను చేర్చుకోవడంపై దృష్టి పెడతారు. అందులో పండ్లను ఆరోగ్యకరమైన ఎంపికగా భావించి ప్రతిరోజూ వాటిని తినడం ప్రారంభిస్తారు. పండ్లలో పోషకాలు సమృద్ధిగా ఉండటమే కాదు శరీరానికి మేలు చేసే ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అయితే అన్ని రకాల పండ్లు బరువు తగ్గడానికి సహాయపడవని మీకు తెలుసా? అవును కొన్ని పండ్లలో సహజ చక్కెర , కేలరీలు ఉంటాయి. అవి మీ బరువు తగ్గించే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. తరచుగా ప్రజలు ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తూ కొన్ని రకాల పండ్లను తీసుకుంటారు. ఈ రోజు డైటింగ్ చేసేవారు ఏ ఏ పండ్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..

అరటిపండ్లు: అరటిపండ్లలో అధిక మొత్తంలో చక్కెర, కేలరీలు ఉంటాయి. ఒక మధ్య తరహా అరటిపండులో దాదాపు 100-120 కేలరీలు, అధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఎవరైనా డైటింగ్ చేస్తుంటే శరీరంలో కేలరీల సమతుల్యతను పాడు చేస్తుంది.

ద్రాక్ష: ఇవి తియ్యగా ఉంటాయి. వీటిలో చాలా సహజ చక్కెర ఉంటుంది. వీటిని ఎక్కువ పరిమాణంలో తింటే బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతారు. అలాగే ఇవి త్వరగా జీర్ణమవుతాయి. కనుక మీకు త్వరగా ఆకలి అనిపిస్తుంది. అతిగా తినే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

పుచ్చకాయ: పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా పుచ్చకాయలో ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం ఇది త్వరగా చక్కెరగా మారుతుంది. ఇన్సులిన్ స్పైక్‌లకు కారణమవుతుంది. కనుక పుచ్చకాయ బరువు తగ్గడాన్ని అడ్డుకుంటుంది.

మామిడి పండు: సాధారణ డైట్ తీసుకునే వారికి వేసవి పండ్లు తగినవి కావు. మామిడి పండ్లలో చాలా సహజ చక్కెర, కేలరీలు ఉంటాయి. ముఖ్యంగా పండిన మామిడి పండ్లు బరువు తగ్గించే ప్రయాణాన్ని నెమ్మది చేస్తాయి. కనుక వీలైతే, వీటిని డైట్ చేసేవారు దూరం పెట్టండి.

పైనాపిల్: పైనాపిల్‌లో కూడా అధిక మొత్తంలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఎవరైనా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే పరిమిత పరిమాణంలో తినండి. దీనిని భారీ మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

ఏ పండ్లు తినాలంటే

డైటింగ్ చేస్తున్నప్పుడు అన్ని రకాల పండ్లను మానేయల్సిన అవసరం లేదు. పండ్లను తెలివిగా ఎంచుకుని తినాలి. డైటింగ్ చేస్తున్నప్పుడు ఆపిల్, బొప్పాయి, జామ, బెర్రీలు, నేరేడు పండ్లను తినవచ్చు. వీటిలో కేలరీలు తక్కువగా..ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా