
వర్కింగ్ ఉమెన్ కి మాత్రమే కాదు హౌస్ వైఫ్ కి కూడా ఉదయం చాలా హడావిడిగా ఉంటారు. పిల్లలకు తొందరగా టిఫిన్‌గా ఏమి చెయ్యాలని అని ఆలోచిస్తారు. ఒకొక్కసారి త్వరగా త్వరగా టిఫిన్ చేయడానికి ఏమీ లేకపోతే బయట ఏదైనా తినాలని ఆలోచిస్తారు. ఈ తొందర కారణంగా బయటి ఆహారం తినేవారు ఎక్కువగానే ఉన్నారు. ఇలా బయట ఆహారం తినడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మీరు కూడా ఉదయం టిఫిన్ ఏమి చేయాలా అని ఆందోళన చెందుతుంటే..రాత్రి మిగిలిన అన్నంతో ఖచ్చితంగా ఈ రెసిపీని ప్రయత్నించండి. దీనిని తయారు చేయడం చాలా సులభం.. కేవలం 15-20 నిమిషాల్లో సిద్ధంగా ఉంటుంది. అదే ఫ్రైడ్ రైస్. ఈ రోజు ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి తెలుకుందాం..
ఫ్రైడ్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు
ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలంటే: రాత్రి మిగిలిన అన్నాన్ని ఉపయోగించి ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. లేదా ఉదయం అప్పటికప్పుడు అన్నం వండి తయారు చేసుకోవచ్చు. క్యారెట్లు, క్యాప్సికమ్, బీన్స్‌లను చిన్నగా కట్ చేయాలి. ఇష్టమైన వారు ఇతర కూరగాయలను కూడా ఉపయోగించవచ్చు.
ఉల్లిపాయ, వెల్లుల్లిని సన్నగా కట్ చేయండి. అల్లం, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోండి. తాజా ఉల్లి ఆకులు ఉంటే సన్నగా కోసి పక్కకు పెట్టుకోండి.
ఇప్పుడు పాన్ వేడి చేసి మంట ఎక్కువగా పెట్టుకోండి. ఫ్రైడ్ రైస్ ని హై ఫ్లేమ్ మీద మాత్రమే తయారు చేసుకోవాలి. ఇప్పుడు అందులో నూనె వేసి వెల్లుల్లి ముక్కలు వేయించాలి. ఉల్లిపాయ కూడా వేయాలి. అల్లం, మిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. వీటిని నిరంతరం కలుపుతూ ఉండాలి, లేకుంటే అవి మాడిపోవచ్చు.
ఇప్పుడు ఈ ఉల్లిపాయల మిశ్రమంలో తరిగిన కూరగాయలను వేసి హై-ఫ్లేమ్ మీద వేయించాలి. కూరగాయలు వేగిన తర్వాత.. అన్నం వేసి, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఈ అన్నంలో సోయా సాస్ , వెనిగర్ వేయండి. ఇష్టమైన వారు చిటికెడు చక్కెర కూడా వేయండి. చక్కెర జోడించడం వల్ల ఫ్రైడ్ రైస్ రుచి సమతుల్యం అవుతుంది. ఈ అన్నాన్ని నిరంతరం కలుపుతూ ఉండండి. అయితే అన్నం విరిగిపోకుండా చూసుకోండి.
ఇప్పుడు ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. ఒక ప్లేట్ లోకి తీసుకుని చివరిగా ఫ్రైడ్ రైస్ పై మిరియాల పొడి జల్లి, సన్నగా తరిగిన ఉల్లి ఆకులతో అలంకరించండి. నిమ్మరసం పిండి సర్వ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..