Bathua Leaves Benefits: ఇదేదో అల్లాటప్పా ఆకు కూర కాదండోయ్..ఆరోగ్యానికి బంగారంలాంటి ప్రయోజనాలు..!

ఆయుర్వేద వైద్యంలోనూ దీనిని విరివిగా ఉపయోగిస్తారు. ఈ ఆకులలో ఐరన్, ఫాస్పరస్, విటమిన్లు ఎ, బి, సి పుష్కలంగా నిండిఉన్నాయి. అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది. బతువా ఆకు కూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తరచూ బతూవా ఆకు కూరను తినటం వల్ల కలిగే లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు...

Bathua Leaves Benefits: ఇదేదో అల్లాటప్పా ఆకు కూర కాదండోయ్..ఆరోగ్యానికి బంగారంలాంటి ప్రయోజనాలు..!
Bathua Leaves

Updated on: Jul 29, 2025 | 1:17 PM

ఆకు కూరలు ఆరోగ్యనిధిగా పరిగణిస్తారు. అలాంటి ఆకు కూరల్లో మనకు తెలియనివి చాలానే ఉన్నాయి. ఎందుకంటే..ఒక్కో ప్రాంతం, ఏరియాను బట్టి ఒక్కో ఆకు కూరను ఇష్టంగా తింటూ ఉంటారు. అలాంటిదే బతూవా. అవును బతూవానే.. ఈ ఆకు కూర.. ఆకులు బాతు కాలు ఆకారంలో ఉంటాయి. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని అంటారు. ఆయుర్వేద వైద్యంలోనూ దీనిని విరివిగా ఉపయోగిస్తారు. ఈ ఆకులలో ఐరన్, ఫాస్పరస్, విటమిన్లు ఎ, బి, సి పుష్కలంగా నిండిఉన్నాయి. అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది. బతువా ఆకు కూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తరచూ బతూవా ఆకు కూరను తినటం వల్ల కలిగే లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు…

బతూవాను కేవలం ఆహారంగానే కాదు.. ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. శరీరంలో వేడి నీటి పొక్కులు వస్తే బతువా ఆకును నులిపి గాయంపై రాస్తే ఫలితం ఉంటుంది. దీంతో స్కిన్ ఇరిటేషన్ త్వరగా తగ్గుతుంది. బతూవా తినడం వల్ల నోటిలోపల పుండ్లు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ, మూత్ర సంబంధిత సమస్యలకు బతువా ఆకు రసంతో చేసిన జ్యూస్ తాగడం వల్ల మేలు జరుగుతుంది. మలబద్ధకం, పంటి నొప్పి, చిగుళ్ల వాపును తగ్గించడంలో కూడా ఈ ఆకును ఉపయోగిస్తారు. బతువా ఆకు జ్యూస్ తాగడం వల్ల కడుపులోని నులిపురుగులు చనిపోయి, కడుపు శుభ్రం అవుతుంది.

బతూవా జ్యూస్‌తో మూత్రవిసర్జన లేదా మూత్ర విసర్జన ప్రాంతంలో చికాకు సమస్యలు ఉంటే దూరం చేస్తుంది. ఇందుకోసం బతువా ఆకు రసంలో 2 టీస్పూన్ల జీలకర్ర పొడి ,టీస్పూన్ల నిమ్మరసం కలపి సిరప్ తయారు చేసుకోవాలి. ఈ సిరప్‌ను రోజుకు రెండుసార్లు తాగితే సమస్య పరిష్కారం అవుతుంది. ఇది కాలేయ సమస్యలకు కూడా మేలు చేస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..