AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫుల్లుగా విటమిన్లు, మినరల్స్.. అన్నంతోపాటు ఈ రొట్టె తింటే మీ ఆరోగ్యం సెట్టయినట్లే..

జొన్న రొట్టెలు కేవలం డయాబెటిస్ ఉన్నవారికే కాదు.. ప్రతి ఒక్కరికీ పోషకాలను అందించే ఆరోగ్యకరమైన ఆహారం. వీటిలో ఫైబర్, ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణకు ఇవి తోడ్పడవచ్చు. రోజువారీ ఆహారంలో జొన్న రొట్టెలను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

ఫుల్లుగా విటమిన్లు, మినరల్స్.. అన్నంతోపాటు ఈ రొట్టె తింటే మీ ఆరోగ్యం సెట్టయినట్లే..
Jowar Roti Benefits
Shaik Madar Saheb
|

Updated on: Nov 10, 2026 | 1:20 PM

Share

పూర్వం మన పెద్దలు జొన్న రొట్టె, రాగి సంకటి, సజ్జ రొట్టె వంటి చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినేవారు. అందుకే వారు బలంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలం జీవించారు. అయితే, మారిన ఆహారపు అలవాట్లు, టెక్నాలజీ ప్రభావంతో చాలామంది ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను విస్మరించారు. ప్రస్తుత రోజుల్లో జొన్న రొట్టెలు ఎక్కువగా షుగర్ పేషెంట్లు, డైటింగ్ చేసేవారు మాత్రమే తింటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ, జొన్న రొట్టెలను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

జొన్నల పోషకాలు..

జొన్నలలో (Jowar / Sorghum) శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కెలోరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫైబర్ (పీచు పదార్థం), కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.. అంతేకాకుండా.. ఖనిజాలు కాల్షియం, ఐరన్ (ఇనుము), పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ తోపాటు.. విటమిన్లు థయామిన్ (B1), రిబోఫ్లావిన్ (B2), నియాసిన్ (B3), విటమిన్ B6, ఫోలేట్ దాగున్నాయి. దీంతోపాటు.. యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో సమస్యలను దూరం చేసేందుకు సహాయపడతాయి.

జొన్న రొట్టెలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఇవి చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గడానికి కూడా జొన్న రొట్టెలు సహాయపడతాయి. జొన్నలను కేవలం రోటీ రూపంలోనే కాకుండా ఇడ్లీ, దోస వంటి రూపాల్లో కూడా తీసుకోవచ్చు.

డయాబెటిస్ ఉన్నవారికి మాత్రమే కాకుండా, అందరికీ జొన్న రొట్టెలు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు భోజనంతో పాటు జొన్న రొట్టెను తింటే చక్కెర నియంత్రణలో ఉంటుంది.

జొన్నలో ఉండే మెగ్నీషియం, ప్రోటీన్, డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి.

జొన్నపిండి గ్లూటెన్-ఫ్రీ కాబట్టి, ప్రతిరోజూ జొన్న రొట్టెను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

గోధుమపిండి చపాతీతో పోలిస్తే జొన్న రొట్టెను తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఒకపూట జొన్న రొట్టెలను తినడం వల్ల కూడా అపారమైన ప్రయోజనాలు శరీరానికి అందుతాయని నిపుణుల చెబుతున్నారు.

అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Follow Us