మేక రక్తం తింటున్నారా.. అసలు ఎవరు తినాలి.. ఎవరు తినొద్దు..? అనేది తెలుసుకోండి.. లేకపోతే..

Goat Blood Benefits: ఆదివారం వస్తే చాలు.. ముక్క లేనిదే ముద్ద దిగదు. మటన్‌తో పాటు చాలామంది మేక రక్తాన్ని కూడా లొట్టలేసుకుంటూ తింటారు. ఇది రక్తాన్ని పెంచుతుందని మన పెద్దలు చెబుతుంటారు. అయితే మేక రక్తం తినడం వల్ల కేవలం లాభాలే కాదు.. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మేక రక్తం ఎవరికి మంచిది? ఎవరికి ప్రమాదకరం? అనేది తెలుసుకుందాం..

మేక రక్తం తింటున్నారా.. అసలు ఎవరు తినాలి.. ఎవరు తినొద్దు..? అనేది తెలుసుకోండి.. లేకపోతే..
Goat Blood Health Benefits

Updated on: Jan 10, 2026 | 8:29 PM

నాన్-వెజ్ ప్రియులకు ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్ ఉండాల్సిందే. అయితే మటన్ ఇష్టపడే వారిలో చాలామంది రక్తం వండుకుని తినడానికి ఆసక్తి చూపిస్తారు. పల్లెటూళ్ల నుంచి పట్టణాల వరకు మేక రక్తాన్ని ఉల్లిపాయలతో ఫ్రై చేసుకుని తింటారు. మరి ఈ మేక రక్తం తినడం ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా? దీనివల్ల కలిగే లాభనష్టాలేంటో ప్రముఖ డాక్టర్ సంతోష్ జాకబ్ వివరించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అద్భుతమైన పోషకాల గని

మానవ రక్తంలో లాగే మేక రక్తంలో కూడా హీమోగ్లోబిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. మేక రక్తంలో దాదాపు 17 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు, శరీర కదలికలకు తోడ్పడతాయి. ఇందులో జింక్, సెలీనియం, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

అతిగా తింటే వచ్చే ముప్పులు ఇవే

ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం. మేక రక్తం విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హీమోక్రొమాటోసిస్: ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల, అతిగా తింటే శరీరంలో ఐరన్ నిల్వలు పెరిగిపోతాయి. దీనివల్ల లివర్, గుండె పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది.

యూరిక్ యాసిడ్ సమస్య: మేక రక్తంలో ప్యూరిన్ అధికంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు లేదా గౌట్‌తో బాధపడేవారు ఇది తింటే కీళ్ల నొప్పులు మరింత తీవ్రమవుతాయి.

జీర్ణ సమస్యలు: జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు దీనిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తవచ్చు.

వండే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మేక రక్తాన్ని సేకరించే విధానం సరిగ్గా లేకపోతే అందులో బ్యాక్టీరియా, వైరస్లు ఉండే అవకాశం ఉంది. రక్తాన్ని సేకరించిన తర్వాత చాలా శుభ్రంగా కడగాలి. లేదంటే ఇన్ఫెక్షన్ల వల్ల వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం ఉంది. రక్తాన్ని నేరుగా ఫ్రై చేయకుండా, ముందుగా ఉప్పు వేసి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి. దీనివల్ల అందులోని సూక్ష్మజీవులు చనిపోతాయి. వారానికి లేదా నెలకు ఒకసారి మితంగా తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది కానీ, ప్రతిరోజూ తీసుకోవడం మంచిది కాదు. మేక రక్తం ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దీన్ని వండే పద్ధతి మరియు తినే పరిమాణంపైనే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..