International Coffee Day 2021: కప్పు కాఫీ తాగనిదే కొంతమందికి రోజు గడవదు. ఎన్నో టెన్సన్‌లకు మంచి మందులా పనిచేస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తక్కువ ధరలో లభిస్తుంది. అందుకే కాఫీ చాలామందికి దగ్గరైంది. అక్టోబర్ 1న అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. ఈ సందర్భంగా కాఫీ ఎక్కడ పుట్టింది. దాని చరిత్ర ఏంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
2014లో అంతర్జాతీయ కాఫీ సమాఖ్య మిలాన్ లో మొదటి సారిగా కాఫీ దినోత్సవాన్ని జరిపింది. అయితే సెప్టెంబర్ 20న కాఫీ డే, నేషనల్ కాఫీ డే జరుపుతున్నప్పటికీ అధికారికంగా అక్టోబర్ 1న అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మన దేశంలో ఉత్పత్తి చేసిన కాఫీ 70 శాతం ఎగుమతి అవుతుండగా 30 శాతం దేశంలో వాడుతున్నారు. దేశంలో కాఫీ సాగు, విస్తరణ, పరిశోధన, నాణ్యతలను కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా చూసుకుంటోంది.
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి
అనేక అధ్యయనాలు కాఫీ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయని సూచించాయి. అంతేకాదు కాలేయానికి మంచిదని నిరూపించారు కూడా. 2016 లో జరిగిన ఒక అధ్యయనంలో కాఫీ వినియోగం మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS) ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు.
క్యాన్సర్‌తో పోరాడుతాయి..
కెఫిన్ తక్షణమే మీ శరీరాన్ని శక్తివంతం, ఉత్తేజితం చేస్తుంది. మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది. కాఫీ యాంటీఆక్సిడెంట్ల గొప్ప మూలం. ఇవి క్యాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.
బరువు తగ్గిస్తాయి..
కాఫీ తాగడం వలన పార్కిన్ సన్ వ్యాధి 30 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. కాఫీ తాగడం వల్ల హేంగోవర్ తగ్గదు. కాఫీ తాగడం వల్ల తీసుకునే ఆహారం తగ్గుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో బరువు తగ్గుతారు. కాఫీలో ఉండే కేఫిన్ శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. ఇందులో విటమిన్ 2, విటమిన్ బి 5, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, నియాసిస్ ఉంటాయి. కాఫీ మీ డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.