Year Ender 2021: కరోనా కాలంలో కొరియన్‌ వంటకాలకు పెరిగిన క్రేజ్‌.. ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలేంటంటే..

|

Dec 31, 2021 | 7:48 AM

మరికొన్ని గంటల్లో ఈ ఏడాది ముగియనుంది. కొత్త సంవత్సరానికి సాదరంగా స్వాగతం పలికేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లుగా పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారి పీడ ఈ ఏడాదైనా అంతమైపోవాలని కోరుకుంటున్నారు

Year Ender 2021: కరోనా కాలంలో కొరియన్‌ వంటకాలకు పెరిగిన క్రేజ్‌.. ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలేంటంటే..
Follow us on

మరికొన్ని గంటల్లో ఈ ఏడాది ముగియనుంది. కొత్త సంవత్సరానికి సాదరంగా స్వాగతం పలికేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లుగా పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారి పీడ ఈ ఏడాదైనా అంతమైపోవాలని కోరుకుంటున్నారు. కాగా వైరస్‌ కారణంగా సుమారు గత రెండేళ్ల పాటు హోటళ్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. లాకడౌన్‌లో ఇవన్నీ మూతపడితే అన్‌లాక్‌ ప్రక్రియలో కూడా పరిమిత సామర్థ్యంతో నడిచాయి. దీంతో ఆహార ప్రియులు బయట భోజనంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే కరోనా కంగారు పెడుతున్నా చాలామంది ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలను విరివిగా వినియోగించుకున్నారు. తమకిష్టమైన ఆహారపదార్థాలను, వంటకాలను మనసారా ఆస్వాదించారు. అలా ఈ ఏడాది భారతీయులు అత్యధికంగా ఆర్డర్‌ చేసిన వంటకాల జాబితాను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా వెల్లడించారు. మొత్తం మూడు (వంటకాలు, ఆహార పదార్థాలు, పండ్లు/ కూరగాయలు) కేటగిరీలుగా విభజించి టాప్‌-5 లిస్ట్‌ను విడుదల చేశారు. ఎప్పటిలాగే వంటకాల్లో భారతీయ వంటకాలకు అగ్రస్థానం లభించగా, ఆహార పదార్థాల్లో బిర్యానీ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈఏడాది చాలామంది కొరియన్‌ వంటకాలను ఎక్కువగా ఆర్డర్‌ చేయడం విశేషం. ఈనేపథ్యంలో కొరియన్‌ వంటకాలకు ఇండియాలో క్రేజ్‌ పెరగడం ఆశ్చర్యంగా ఉందంటూ గోయెంకా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరి ఈ బిజినైస్‌ టైకూన్‌ అంచనా ప్రకారం భారతీయులు ఆర్డర్‌ చేసిన టాప్‌- 5 వంటకాలు, ఆహార పదార్థాలేంటో చూద్దాం రండి.

టాప్‌- 5 వంటకాలు
* భారతీయ వంటకాలు
* పాన్‌ ఏషియన్‌ రెసిపీలు
* చైనీస్‌
* మెక్సికన్‌
* కొరియన్‌

ఆహార పదార్థాలు
*బిర్యానీ
*సమోసాలు
*పావ్‌ బాజీ
*గులాబ్‌ జామూన్‌
*రసమలై

పండ్లు/ కూరగాయలు
*టొమాటోలు
*అరటి పండ్లు
* వెల్లుల్లి
*బంగాళా దుంపలు
* మిరపకాయలు

Also Read:

Omicron: భారత్‌లో ఒమిక్రాన్ తొలి మరణం.. నైజీరియా నుంచి వచ్చాడన్న అధికారులు.. 1200 దాటిన కేసులు..!

Ration Card: రేషన్‌ కార్డు, ఇళ్లు లేనివారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త వ్యవస్థ..!

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. ఈ రోజు తులం గోల్డ్ ఎంతుందంటే..