Red Chili Side Effects: ఎర్రకారం ఎఫెక్ట్‌..మామూలుగా ఉండదు..! ఎన్ని లాభాలో అన్ని నష్టాలు కూడా..(వీడియో)

Red Chili Side Effects: ఎర్రకారం ఎఫెక్ట్‌..మామూలుగా ఉండదు..! ఎన్ని లాభాలో అన్ని నష్టాలు కూడా..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 31, 2021 | 9:14 AM

కర్రీలను స్పైసీగా, టేస్టీగా చేయడానికి మనమందరం ఎర్ర మిరపకాయలను ఉపయోగిస్తుంటాం. దీన్ని ఎక్కువగా భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తారని తెలిసిందే. సరైన పరిమాణంలో వాడితే శరీరానికి చాలా మేలు చేస్తుంది. కానీ, అతిగా వాడితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.


కర్రీలను స్పైసీగా, టేస్టీగా చేయడానికి మనమందరం ఎర్ర మిరపకాయలను ఉపయోగిస్తుంటాం. దీన్ని ఎక్కువగా భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తారని తెలిసిందే. సరైన పరిమాణంలో వాడితే శరీరానికి చాలా మేలు చేస్తుంది. కానీ, అతిగా వాడితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు కూడా ఆహారంలో అవసరమైన దానికంటే ఎక్కువగా ఎర్ర మిరపకాయలను ఉపయోగిస్తే, ఈరోజు నుంచి తగ్గించండి. అధికంగా ఎర్ర మిరపకాయలను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు కూడా చాలానే ఉన్నాయి…అవేంటో ఇప్పుడు చూద్దాం…మలబద్ధకం సమస్య ఎర్ర మిరపకాయ తీసుకోవడం ద్వారా తొలగిపోతుందని మనందరికీ తెలుసు. కానీ, అతిగా తీసుకుంటే డయేరియా వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ పని కడుపుని కలవరపెడుతుంది. కొన్నిసార్లు వికారం లాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎర్ర మిరపకాయల వినియోగాన్ని తగ్గించాలి.ఎర్ర మిరపకాయను అధికంగా ఉపయోగించడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది కడుపులో మంటను కూడా కలిగిస్తుంది. దీని కారణంగా, కడుపుతో పాటు గుండెలో మంట పుట్టిస్తుంది..నిరంతరం కడుపు, ఛాతీలో మండుతున్న అనుభూతి అనుభవిస్తున్నట్లయితే, దీనికి కారణం కూడా ఎర్ర మిరపకాయ కావచ్చొ..అధికంగా ఎండు మిరపకాయలు తీసుకుంటే ఆస్తమా పేషంట్లకు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దీనితో పాటు రోగుల శరీరంలో వాపులు కూడా రావొచ్చు. అప్పుడే ఎటువంటి సమస్యలు రా కుండా ఉంటాయి. ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు వచ్చే అవకాశం ఉంది. మీ రోజువారీ ఆహారంలో పరిమిత మొత్తంలో ఎర్ర మిరపకాయలను వాడేందుకు ప్రయత్నించడం మంచింది.