Tricolor Recipe: ఆగష్టు 15న పిల్లలకు అతిధులకు ట్రై కలర్ ఇడ్లీని అందించండి.. రెసిపీ మీ కోసం

|

Aug 09, 2024 | 12:08 PM

పాఠశాలలు, కార్యాలయాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే ఆహారంతో కూడా దేశభక్తిని తెలియజేయాలనుకున్తున్నారా.. మార్కెట్ లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో అనేక రకాల వంటకాలు లభిస్తున్నాయి. దీన్నే ట్రై కలర్ డిషెస్ అని కూడా అంటారు. మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.

Tricolor Recipe: ఆగష్టు 15న పిల్లలకు అతిధులకు ట్రై కలర్ ఇడ్లీని అందించండి.. రెసిపీ మీ కోసం
Tricolor Instant Suji Idli
Image Credit source: Instagram/radhas.culinary
Follow us on

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసినా స్వాతంత్య దినోత్సవ సందడి కనిపిస్తోంది. మార్కెట్‌లో కూడా త్రివర్ణ పతాకం థీమ్‌లో బట్టలు, గాలిపటాలు, అనేక ఇతర వస్తువులు దర్శనం ఇస్తున్నాయి. పాఠశాలలు, కార్యాలయాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే ఆహారంతో కూడా దేశభక్తిని తెలియజేయాలనుకున్తున్నారా.. మార్కెట్ లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో అనేక రకాల వంటకాలు లభిస్తున్నాయి. దీన్నే ట్రై కలర్ డిషెస్ అని కూడా అంటారు. మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.

ఇంట్లో ట్రై కలర్‌లో రకరకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇటువంటి ఆహారాన్ని ఇష్టంగా తింటారు. అదే సమయంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇంటికి అతిథులు వస్తే, వారు ఇటువంటి వంటకాన్ని వెరైటీగా అందించవచ్చు. ఈ రోజు త్రివర్ణ ఇడ్లీ తయారీ విధానం తెలుసుకుందాం..

ట్రై కలర్ ఇడ్లి..

ఇవి కూడా చదవండి

ఆగస్టు 15న త్రివర్ణ థీమ్‌లో రుచికరమైన ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. మీరు నారింజ, తెలుపు , ఆకుపచ్చ రంగులగా విభజించాలి. కాషాయం కలర్ కోసం క్యారెట్ ను, ఆకుపచ్చ రంగు కోసం బచ్చలికూర పేస్ట్ ను సిద్ధం చేసుకోవాలి.

త్రివర్ణ ఇడ్లీ
చాలా మందికి అల్పాహారం గా ఇడ్లీని తినడానికి ఇష్టపడతారు. తెల్లని మల్లె పువ్వు వంటి ఇడ్లీకి కారం పొండి, నెయ్యి, కొబ్బరి చట్నీతో ఆహా ఏమి రుచి అంటూ లాగించేస్తారు. అయితే స్వాతంత్ర్య దినోత్సవ సందర్భామగా ఇడ్లీ ని కలర్స్ అద్ది.. జాతీయ జెండా రంగుల్లో కనిపించేలా తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్ధాలు:

  1. సుజీ రవ్వ – రెండు గిన్నెలు
  2. పెరుగు – రెండు గిన్నెలు
  3. ఉప్పు – రుచికి సరిపడా
  4. బేకింగ్ సోడా – అర టీ స్పూన్
  5. క్యారెట్ – రసం
  6. బచ్చలికూర – రసం

ట్రై ఇడ్లీ తయారు చేసే విధానం: ముందుగా సుజీ రవ్వను శుభ్రం చేసుకుని అందులో పెరుగు వేసి బాగా కలపాలి. ఇపుడు ఈ మిశ్రమాన్ని 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఇప్పుడు ఈ పేస్ట్‌లో రుచికి తగిన ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. దీని తరువాత సుజీ రవ్వ మిశ్రమాన్ని మూడు గా విభజించి .. ఒక భాగాన్ని యధావిధిగా పక్కకు పెట్టండి. ఇప్పుడు ఒక భాగంలో క్యారెట్ రసం, రెండో భాగంలో బచ్చలి రసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూడు రంగులతో అంటే తెలుపు, కాషాయం, అకుపచ్చ రంగుల మిశ్రమం రెడీ అవుతుంది.

ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకుని అందులో కొంచెం నీరు పోసుకుని గ్యాస్ స్టవ్ మీద పెట్టండి. ఇంతలో ఇడ్లీ స్టాండ్ ను తీసుకుని ప్లేట్స్ లో ఈ మూడు రంగుల మిశ్రమాన్ని ఇడ్లిలా వేసుకుని 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకూ ఆవిరిమీద ఉడికించుకోవాలి. తర్వాత వీటిని ఇడ్లీ కుక్కర్ నుంచి తీసి చల్లారనివ్వాలి. చెంచా సహాయంతో బయటకు తీసి ప్లేట్ లో అందంగా త్రివర్ణ పతకం రంగుల్లో అమర్చుకోవాలి. అంతే ట్రై కలర్ ఇడ్లీ రెడీ… వీటిని పిల్లలకు, అతిధులకు సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో అందించండి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..