మనలో చాలా మంది వయసుకు తగ్గట్టుగా హైట్ ఉండరు. చాలా మంది వయసు ఎక్కువగా ఉన్నా.. పోట్టిగా ఉండిపోతారు. దీంతో తీవ్ర డిప్రెషన్‌కు లోనవుతుంటారు. సాధారణంగా హైట్ పెరగడం అంటే అమ్మాయిలు 18 సంవత్సరాల వరకు అబ్బాయిలు 20 సంవత్సరాల వరకు పెరుగుతారని అంటుంటారు. అది నిజమే. ఇక 18 ఏళ్లు దాటిన తర్వాత హైట్ పెరగడం ఆగిపోతారు. చాలా మంది వయసుకు హైట్‌కు సంబంధం లేకుండా ఉంటారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. హైట్ పెరిగెందుకు రకారకాల ప్రయోగాలు చేస్తుంటారు. కానీ టీనెజ్ దాటక కూడా హైట్ పెరగవచ్చు. అది ఎలానో తెలుసుకుందామా.
సాధారణంగా హైట్ పెరగడం అనేది.. జన్యుపరంగా ఆధారాపడి ఉంటుంది. అంటే మీ కుటుంబంలో ఎవరైనా హైట్ తక్కువగా ఉంటే వారిలానే మీరు కూడా హైట్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుదన్నమాట. ఇది వారసత్వంగా వస్తుంది అంటారు. ఇక టీనేజ్ వచ్చేసరికి హార్మోన్ల లోపం, గ్రోత్ ప్లేట్స్ పెరగడం ఆగిపోతుంది. ఇక మాములుగా 14 నుంచి 18 సంవత్సరాల మధ్యలో మాత్రమే పొడవు పెరుగుతారు. ఈ క్రమంలోనే వారి వెన్నుముక పెరగడం, మృదులాస్తి కోల్పోవడం జరుగుతుంది. హైట్ పెరగడం అనేది మీరు తీసుకునే ఆహారంపై. వ్యాయామాల పై ఆధారపడి ఉంటుంది.
యుక్త వయసు దాటక హైట్ పెరగాలనుకునేవారు ఎక్కువగా కాల్షియం, విటమిన్ బి12, విటమిన్ డి ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది. అలాగే… మొలకెత్తిన విత్తనాలతోపాటు, ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవే కాకుండా కొన్ని రకాల టిప్స్ పాటిస్తే.. టీనేజ్ దాటక హైట్ పెరిగే అవకాశం ఉంది. అవెంటో తెలుసుకుందమా..
మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే.. డెస్క్ దగ్గర ఎక్కువ సమయం ఉండే సమయంలో కూర్చిలో నిటారుగా కూర్చోండి. అంటే మీ వెన్నుముక వంగిపోకుండా.. నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఎక్కువ గంటలు కూర్చోవడం వలన వెన్నుముక పెరుగుతుంది. అలాగే మీరు కాస్తా పొడవుగా కూడా కనిపిస్తారు.
యోగా చేయడం వలన మీ మనస్సు, శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయి. దీని వలన పొడవు పెరగకపోవచ్చు. కానీ.. కండరాలకు బలాన్ని ఇస్తుంది. శ్వాస వ్యాయమాలు చేయడం వలన శరీరానికి, మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. హైట్ పెరుగుతున్న సమయంలో కండరాల శక్తి ప్రధానమైంది. మడమల నుండి షూ ఇన్సోల్స్ వరకు ఫిట్ డ్రెస్ వేసుకోవడం వలన మీరు హైట్‌గా కనిపిస్తారు.
ఇందుకోసం మార్కెట్లో చాలా సప్లిమెంట్స్, సహజ ఉత్పత్తులు లభిస్తున్నాయి. కొన్ని మల్టీ విటమిన్లు, సహజ పోషక పదార్థాలు ఎత్తు పెరగాలనుకునే వారికి సహయపడతాయి. అలాగే ఇవి మీ హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తే.. మీరు డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. ఈ సమయంలో విటమిన్ డీ, కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి.
అయితే దాదాపు ఇలా చేయడం వలన హైట్ పెరిగే అవకాశాలు లేకపోయినా.. మీరు ధరించే దుస్తులు, కూర్చునే విధానాలు, ఉండే పద్దతుల వలన హైట్‌గా కనిపిస్తారు.
Also Read:
ఉదయం 8.30 తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తే డయాబెటిస్ వస్తుందా ? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..