శాఖాహారులకు కావల్సిన పోషకాలు అందించడంలో శనగలు ఎప్పుడూ ప్రదమ స్థానంలో ఉంటాయి. సాదారణంగా ఎర్ర శెనగలు, కాబూలీ సెనగలు, లెగ్యూమ్ సెనగలుమ మార్కెట్లో కనిపిస్తుంటాయి. వీటిల్లో ఏ విధమైన శనగలనైనా రోజుకు కప్పు తిన్నారంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి శనగలు పోషకాల నిలయం. ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు నియంత్రించడంలో వీటి పాత్ర కీలకం. శనగల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ప్రొటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు, మాంగనీస్, కాపర్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి.
రోజుకు గుప్పెడు శనగలు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శనగల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇవి ఎర్రరక్త కణాల ఉత్పత్తిలో ఎంతో ఉపయోగపడతాయి. కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెంపులో తోడ్పడుతుంది. వీటిలోని పీచు, ప్రొటీన్లు రక్తంలో గ్లూకోజు స్థాయిలను సమన్వయం చేస్తుంది. డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది. అందుకే.. రోజుకు కనీసం గుప్పెడు శనగలు తినడం అస్సలు మర్చిపోకండి.
మరిన్ని హెల్త్ సమాచారం కోసం క్లిక్ చేయండి.