అలోవీరాతో అద్భుత ప్రయోజనాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

అలోవీరా ఆంత్రాక్వినోన్స్‌ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇవి మలబద్ధకానికి ప్రకృతి ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలోవీరాతో మీ జుట్టు మెరుస్తూ, స్మూత్‌గా మారిపోతుంది. జుట్టు రాలిపోయేవారు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. కడుపులోని కొవ్వు, చెడు పదార్థాలు, పేగులకు అంటుకుపోయే ఆయిల్ వంటివన్నీ మొత్తం క్లీన్ అయిపోతాయి. ఉత్తి జ్యూస్ తాగలేమనుకునేవారు అందులో కాస్త నిమ్మరసం, తేనె లాంటివి కలుపుకుంటే సరి.

అలోవీరాతో అద్భుత ప్రయోజనాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు కలబంద వాడకంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. దీనిలోని కొన్ని పదార్థాలు దురద, ఎర్రబారడం, మంట, దద్దుర్లు కలిగించవచ్చు. కాబట్టి ముఖానికి వాడే ముందు చేతికి కొద్దిగా రాసి 24 గంటలు ఆగాలి. ఎటువంటి సమస్య లేకపోతే అప్పుడు ముఖానికి అప్లై చేయవచ్చు.

Updated on: Jun 25, 2025 | 10:48 AM

అలోవీరాతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. చర్మ సమస్యలతో పాటు డయోబెటిస్ రోగులకు అలోవీరా అద్భుతంగా పని చేస్తుంది. జిడ్డు చర్మంతో చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. ఇలాంటి వారు కలబంద ఆకుని నీళ్లలో కాసేపు మరిగించి దాన్ని పేస్ట్‌లాగా వాడుకోవచ్చు. ఇలాంటి ఫేస్‌ మాస్క్‌తో మంచి ఫలితం ఉంటుంది. ముఖంలో ట్యాన్ సమస్యకు కూడా అలోవీరాతో చెక్ పెట్టొచ్చు. అలోవీరా గుజ్జును నిమ్మరసం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో ట్యాన్ సమస్య తగ్గుతుంది.

అలోవీరాను పచ్చిగా లేదా జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు. ఫలితంగా చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలోవీరా జ్యూస్ ద్వారా విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. మంచి ఆరోగ్య ఫలితాలు అందుతాయి. కడుపులోని కొవ్వు, చెడు పదార్థాలు, పేగులకు అంటుకుపోయే ఆయిల్ వంటివన్నీ మొత్తం క్లీన్ అయిపోతాయి. ఉత్తి జ్యూస్ తాగలేమనుకునేవారు అందులో కాస్త నిమ్మరసం, తేనె లాంటివి కలుపుకుంటే సరి.

గుండె సంబధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలోనూ అలోవీరా జ్యూస్ అద్భుత మేలు చేస్తుంది. అలోవీరా ఆంత్రాక్వినోన్స్‌ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇవి మలబద్ధకానికి ప్రకృతి ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అలోవెరా గుజ్జునూ.. కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టిస్తే మంచి మేలు చేస్తుంది. దీంతో జుట్టు రిపేర్ అవుతుంది. చుండ్రు వదిలిపోతుంది. తలలోని మృత కణాలు తొలగిపోతాయి. మీ జుట్టు మెరుస్తూ, స్మూత్‌గా మారిపోతుంది. జుట్టు రాలిపోయేవారు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. కడుపులోని కొవ్వు, చెడు పదార్థాలు, పేగులకు అంటుకుపోయే ఆయిల్ వంటివన్నీ మొత్తం క్లీన్ అయిపోతాయి. ఉత్తి జ్యూస్ తాగలేమనుకునేవారు అందులో కాస్త నిమ్మరసం, తేనె లాంటివి కలుపుకుంటే సరి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..