AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వార్నీ ఇదేం పిచ్చిరా సామీ..! ముఖానికి తామర ఆకు మాస్క్‌లట..ఎందుకంటే..

సిచువాన్‌లో ఇద్దరు మహిళలు ప్రారంభించిన ఈ తామర ఆకుల క్రేజ్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. చర్మ సంరక్షణలో భాగంగా సూర్యరశ్మి నుండి సురక్షితంగా ఉండటానికి ఏదైనా చేసే ఈ చైనీస్ మహిళల సృజనాత్మకతకు ఇప్పుడు సోషల్‌ మీడియా కూడా షాక్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఫన్నీ రియాక్షన్స్‌ ఇస్తున్నారు. కానీ కొందరు నిజంగానే ఇది మేలు చేస్తుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Watch: వార్నీ ఇదేం పిచ్చిరా సామీ..! ముఖానికి తామర ఆకు మాస్క్‌లట..ఎందుకంటే..
Women Wearing Lotus Leaves1
Jyothi Gadda
|

Updated on: Jun 25, 2025 | 10:29 AM

Share

చైనా ప్రజల చర్మ సంరక్షణ అలవాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల, చైనాలోని సిచువాన్ నుండి వచ్చిన ఒక వీడియో ఇంటర్‌నెట్‌ వేదికగా హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో ఇద్దరు యువతులు సన్‌స్క్రీన్‌కు బదులుగా తామర ఆకులుతో ముఖాలను కప్పుకుని బైక్‌ నడుపుతున్నారు. వీడియో వైరల్‌గా మారడంతో నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఈ వీడియో వెనుక ఉన్న అసలు వాస్తవం కోసం చాలా మంది సర్చ్‌ చేస్తున్నారు. సన్‌స్క్రీన్‌కు బదులుగా తామర ఆకులను ఉపయోగించవచ్చా అనే సందేహం ఇప్పుడు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

సిచువాన్‌లో ఇద్దరు మహిళలు ప్రారంభించిన ఈ తామర ఆకుల క్రేజ్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. చర్మ సంరక్షణలో భాగంగా సూర్యరశ్మి నుండి సురక్షితంగా ఉండటానికి ఏదైనా చేసే ఈ చైనీస్ మహిళల సృజనాత్మకతకు ఇప్పుడు సోషల్‌ మీడియా కూడా షాక్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఫన్నీ రియాక్షన్స్‌ ఇస్తున్నారు. కానీ కొందరు నిజంగానే ఇది మేలు చేస్తుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

నిపుణుల వివరణ మేరకు..నిజంగానే తామర ఆకులు చర్మాన్ని చల్లబరిచే లక్షణాలను కలిగి ఉంటాయని అంటున్నారు. తామర ఆకుల్లోని ఈ గుణం సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుండి రక్షించడంలో కవచంగా పనిచేస్తాయని అంటున్నారు. అయితే, ముఖానికి ఇలా ఆకులను ఉపయోగించటం మంచి ఆలోచన కాదని వారు అభిప్రాయపడుతున్నారు. రీసెర్చ్ జర్నల్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కాస్మెటిక్ సైన్స్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, తామరను సౌందర్య సాధనాలలో విస్తృతంగా ఉపయోగిస్తారని చెబుతున్నారు. తామరలోని గుణాలు వృద్ధాప్యాన్ని దూరం చేయటానికి, మొటిమలను వదిలించుకోవడానికి మంచిదని అధ్యయన నివేదిక చెబుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇప్పుడు క్రమంగా సన్‌స్క్రీన్‌కు బదులుగా తామర ఆకులను ఉపయోగించే ధోరణి పెరుగుతోంది. కానీ, ఇది సన్‌స్క్రీన్‌కు ప్రత్యామ్నాయం కాదని ముంబైకి చెందిన చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ షరీఫా చౌస్ చెప్పారు. తామర ఆకులు సన్‌స్క్రీన్‌ల మాదిరిగా అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించలేవని, దీనికి ఎలాంటి ఆధారాలు కూడా లేవని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..