Kitchen Tips: ఆకు కూరలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలా.. అయితే ఇలా చేసి చూడండి!

|

Oct 17, 2023 | 5:54 PM

ఆకు కూరలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రెండు రోజులు ఫ్రెష్ గా ఉండాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఎక్కువ రోజులు ఎలా ఫ్రెష్ గా ఉంటాయి. ఉండనే ఉండవు అని గృహుణిలందరూ అనుకుంటారు. అందుకే అప్పటికప్పుడు తెచ్చి ఫ్రెష్ గా వండుకుని తింటూంటారు. ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. నాన్ వెజ్ కంటే ఆకు కూరలు తింటేనే బాడీలో ఆరోగ్యంగా.. అదనపు కొవ్వులు చేరకుండా ఉంటాయి. అంతే కాకుండా ఎప్పటికప్పుడు పొట్ట కూడా క్లీన్ అవుతుంది. జీర్ణ క్రియ..

Kitchen Tips: ఆకు కూరలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలా.. అయితే ఇలా చేసి చూడండి!
Leafy Vegtables
Follow us on

ఆకు కూరలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రెండు రోజులు ఫ్రెష్ గా ఉండాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఎక్కువ రోజులు ఎలా ఫ్రెష్ గా ఉంటాయి. ఉండనే ఉండవు అని గృహుణిలందరూ అనుకుంటారు. అందుకే అప్పటికప్పుడు తెచ్చి ఫ్రెష్ గా వండుకుని తింటూంటారు. ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. నాన్ వెజ్ కంటే ఆకు కూరలు తింటేనే బాడీలో ఆరోగ్యంగా.. అదనపు కొవ్వులు చేరకుండా ఉంటాయి. అంతే కాకుండా ఎప్పటికప్పుడు పొట్ట కూడా క్లీన్ అవుతుంది. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. బరువు తగ్గుతారు. రోగ నిరోధక శక్తి మెరుగు పడటంతో పాటు పలు రకాల విటమిన్లు, పోషకాలు, మినరల్స్ మనకు అందుతాయి. అందుకే ఆకు కూరల్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తూంటారు.

అయితే ఆకు కూరలు ఒకటి, రెండు రోజుల కంటే నిల్వ ఉండవు. వాడి పోతాయి. అయితే ఒక్కోసారి మార్కెట్ లో మనకు కావాల్సిన ఆకు కూరలు లభించవని ఒక్కటే సారి కొని తీసుకొస్తూంటారు. ఇలాంటప్పుడు ఆకు కూరల్ని ఎలా నిల్వ చేయాలని తెగ తర్జన భర్జన పడుతూంటారు. అయితే కొన్ని ఇలాంటి టిప్స్ పాటించడం వల్ల ఆకు కూరలు తొందరగా పాడవ్వకుండా.. ప్రెష్ గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మరి ఆ సింపుల్ టిప్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం.

టవల్ లో చుట్టి పెట్టాలి:

ఇవి కూడా చదవండి

ఆకు కూరల్ని నిల్వ చేయడానికి ఈ పద్దతి బాగా హెల్ప్ అవుతుంది. ముందుగా ఆకు కూరల్లో ఉన్న చెడిపోయిన, దెబ్బతిన్న ఆకులను తీసేసి.. క్లీన్ చేసి పక్కకు పెట్టాలి. అవి పొడిగా అయ్యేంత వరకూ పక్కకు పెట్టి.. ఆ తర్వాత వాటిని టవల్ లో చుట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆకు కూరలు తొందరగా పాడవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఆ తర్వాత మీకు కావాల్సిన అప్పుడు యూజ్ చేసుకోవడమే.

పేపర్ లో పెట్టండి:

ఆకు కూరలు ఫ్రెష్ గా ఉండాలంటే ముందు వాటిలో ఉన్న దెబ్బతిన్న ఆకులను తీసేసి.. కాడలను కట్ చేసి ఒక పేపర్ లో రోల్ చేయాలి. ఇలా రోల్ చేసిన ఆకు కూరల్ని ఒక కంటైనర్ బాక్స్ లో కానీ, జిల్ లాక్ బ్యాగ్ లో కానీ పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే ఆకు కూరలు ఐదు నుంచి ఆరు రోజుల పాటు నిల్వ ఉంటాయి.

ఫ్రూట్స్ కి దూరంగా పెట్టాలి:

ఆకు కూరల్ని స్టోర్ చేసే ముందు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇవి ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్ గా ఉండాలంటే.. వీటిని పండ్లకు దూరంగా పెట్టాలి. అంటే యాపిల్, బనానా, కివీస్ వంటి పండ్లు ఇథిలీన్ గ్యాస్ ను విడుదల చేస్తాయి. కాబట్టి వీటి వల్ల కూరగాయలు, ఆకు కూరలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆకు కూరల్ని నిల్వ చేయాలంటే పండ్లకు దూరంగా స్టోర్ చేయండి.

ఫ్రీజర్ చేయండి:

ఆకు కూరలు ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా నిల్వ ఉండాలంటే.. వాటిని నీటిగా కత్తిరించి.. ఒక జిప్ లాగ్ బ్యాగ్ లో వేసి డీఫ్ ఫ్రీజర్ లో స్టోర్ చేయండి. ఇలా చేస్తే ఆకు కూరలు పాడవ్వకుండా.. ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి.

అయితే ఆకు కూరలు ఎంత ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉన్నా.. వాటిని రెండు, మూడు రోజుల్లో తినేలా ప్లాన్ చేయండి. లేదంటే వాటిలో ఉంటే పోషకాలు మనకు అందవు. అంతే కాకుండా రుచి కూడా ఉండదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.