Rose Syrup: బయట దొరికే రోజ్ సిరప్ ని ఇలా ఇంట్లో ఈజీగా చేసుకోండి.. సూపర్ టేస్ట్!

|

Nov 13, 2023 | 10:28 PM

రోజ్ సిరప్ గురించి చాలా మందికే తెలుసు. రోజ్ సిరప్ ని.. షర్బత్, మిల్క్ షేక్స్, కొన్ని రకాల స్పెషల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ వంటి వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటారు. రోజ్ సిరప్ ని యాడ్ చేయడంతో మరింత సూపర్ టేస్ట్ వస్తుంది. రోజ్ సిరప్ కూడా మార్కెట్లో విరివిగా లభ్యమవుతూ ఉంటుంది. ఈ రోజ్ సిరప్ ని ఇంట్లో కూడా ఈజీగా కొన్ని టిప్స్ ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బయట కొన్న రుచే వస్తుంది. అంతే కాకుండా ఇంట్లో తయారు చేసింది..

Rose Syrup: బయట దొరికే రోజ్ సిరప్ ని ఇలా ఇంట్లో ఈజీగా చేసుకోండి.. సూపర్ టేస్ట్!
rose syrup
Follow us on

రోజ్ సిరప్ గురించి చాలా మందికే తెలుసు. రోజ్ సిరప్ ని.. షర్బత్, మిల్క్ షేక్స్, కొన్ని రకాల స్పెషల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ వంటి వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటారు. రోజ్ సిరప్ ని యాడ్ చేయడంతో మరింత సూపర్ టేస్ట్ వస్తుంది. రోజ్ సిరప్ కూడా మార్కెట్లో విరివిగా లభ్యమవుతూ ఉంటుంది. ఈ రోజ్ సిరప్ ని ఇంట్లో కూడా ఈజీగా కొన్ని టిప్స్ ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బయట కొన్న రుచే వస్తుంది. అంతే కాకుండా ఇంట్లో తయారు చేసింది కాబట్టి.. హెల్దీగా ఉంటుంది. మరి ఈ రోజ్ సిరప్ కి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజ్ సిరప్ కి తయారీకి కావాల్సిన పదార్థాలు:

బాగా ఎండిన దేశవాలీ గులాబి రేకులు, పంచదార, రోజ్ కలర్, వెనీలా ఎస్సెన్ లేదా రోజ్ ఎసెన్స్, ఉప్పు, నిమ్మ రసం.

ఇవి కూడా చదవండి

రోజ్ సిరప్ తయారీ విధానం:

ముందుగా ఒక లోతైన పాత్ర తీసుకోవాలి. ఆ పాత్రలో అర కప్పు నీళ్లు వేసుకుని, స్టవ్ ఆన్ చేసుకుని పెట్టు కోవాలి. నీళ్లు కాస్త వేడెక్కాక.. మీడియం మంట పెట్టి అందులోనే ఓ గుప్పుడు గులాబి రేకులు కూడా వేసుకుని ఓ ఐదు నిమిషాల పాటు మరిగించు కోవాలి. నెక్ట్స్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వీటిపై మూత పెట్టి ఓ రెండు నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత ఈ నీటిని వడ కట్టి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఆ నెక్ట్స్ గులాబి రేకుల్లో మరో కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు వీటిల్లో ఒక కప్పు పంచదార వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకుని పక్కకు పెట్టుకున్న గులాబి నీటిని కూడా వేసుకోవాలి.

పంచదార బాగా కరిగిన తర్వాత వెనీలా ఎసెన్స్ అర టీ స్పూన్, రోజ్ కలర్ రెండు, మూడు చుక్కలు, ఉప్పు కొద్దిగా, ఒక స్పూన్ నిమ్మ రసం వేసి కలపాలి. దీనిని మరో ఐదు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్ట్ ని ఇచ్చే రోజ్ సిరప్ సిద్ధం అవుతుంది. ఇలా ఇంట్లోనే సింపుల్ గా రోజ్ సిరప్ ని తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేసి చూడండి.