Lemon Candy: నిమ్మకాయ ఐస్ క్యాండీ ఇలా చేస్తే.. పిల్లలకు బాగా నచ్చుతుంది!

| Edited By: Ravi Kiran

Aug 03, 2024 | 6:00 PM

ఐస్‌ అన్నా, ఐస్ క్రీమ్ అన్నా పిల్లలకు ఎంతో ఇష్టం. పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మనకు లభించే వాటిల్లో ఐస్ క్రీమ్ మరింత రుచిగా, రిఫ్రెషింగ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఇంట్లో ఏమైనా సింపుల్ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇలా వెరైటీగా ఐస్ క్యాండీలు చేసి గెస్టులకు ఇవ్వొచ్చు. అదే విధంగా పిల్ల బర్త్‌డేలాకు కూడా పిల్లలకు ఐస్ క్యాండీలు ఇస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. వీటిని ఇంట్లో తయారు చేయడం కూడా ఎంతో ఈజీ. ఇంకెందుకు లేట్ ఈ లెమన్ ఐస్ క్యాండీలను ఎలా తయారు..

Lemon Candy: నిమ్మకాయ ఐస్ క్యాండీ ఇలా చేస్తే.. పిల్లలకు బాగా నచ్చుతుంది!
Lemon Ice
Follow us on

ఐస్‌ అన్నా, ఐస్ క్రీమ్ అన్నా పిల్లలకు ఎంతో ఇష్టం. పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మనకు లభించే వాటిల్లో ఐస్ క్రీమ్ మరింత రుచిగా, రిఫ్రెషింగ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఇంట్లో ఏమైనా సింపుల్ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇలా వెరైటీగా ఐస్ క్యాండీలు చేసి గెస్టులకు ఇవ్వొచ్చు. అదే విధంగా పిల్ల బర్త్‌డేలాకు కూడా పిల్లలకు ఐస్ క్యాండీలు ఇస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. వీటిని ఇంట్లో తయారు చేయడం కూడా ఎంతో ఈజీ. ఇంకెందుకు లేట్ ఈ లెమన్ ఐస్ క్యాండీలను ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లెమన్ ఐస్ క్యాండీలకు కావాల్సిన పదార్థాలు:

నిమ్మ కాయ, కార్న్ ఫ్లోర్, పుదీనా, నిమ్మ రసం, బ్లాక్ సాల్ట్, ఫుడ్ కలర్, పంచదార.

లెమన్ ఐస్ క్యాండీలు తయారీ విధానం:

ముందుగా నిమ్మ కాయ తొక్కను పావు టీ స్పూన్ మోతాదులో తురిమి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో నిమ్మ కాయ తొక్క తురుము, నీళ్లు, పంచదార వేసి వేడి చేయాలి. పంచదార కరిగిన తర్వాత అరకప్పు నీటిలో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. దీనిని మరో రెండు మూడు నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పంచదార మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. నెక్ట్స్ ఈ మిశ్రమంలో నిమ్మ రసం, మీకు నచ్చిన కలర్‌లో కొద్దిగా ఫుడ్ కలర్, బ్లాక్ సాల్ట్ వేసి కలపాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా వడకట్టి.. కుల్ఫీ మౌల్డ్స్‌లోకి తీసుకోవాలి. అలాగే దీనికి స్టిక్ ఒకటి పెట్టాలి. కుల్ఫీ మౌల్డ్స్ లేని వాళ్లు గ్లాసులను కూడా ఉపయోగించవచ్చు. ఇలా అన్నింటినీ సిద్ధం చేసుకున్న తర్వాత.. వీటిని రాత్రంగా డీప్ ఫ్రీజర్‌లో ఉంచి ఫ్రీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు తినాలి అనుకున్నప్పుడు ఫ్రీజర్ నుంచి తీసి వేరు చేసి.. సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ లెమన్ ఐస్ క్రీమ్ సిద్ధం. ఈ విధంగా ఇంట్లోనే ఐస్‌ క్రీమ్స్ తయారు చేసుకోవచ్చు.