Egg Manchurian: వేడి వేడిగా ఎగ్ మంచూరియా.. ఇలా చేశారంటే ఫిదా అవుతారు!

| Edited By: Ravi Kiran

Jul 23, 2024 | 11:00 PM

మంచూరియాల అనేది పూర్తిగా చైనీస్ వంటకం. కానీ మన భారత దేశపు మసాలాలు జోడించి.. ఇండియన్ స్టైల్‌లో మంచూరియా చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఎంతో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటుంది. తియ్యగా తినేవారికి తియ్యగా.. స్పైసీగా తినేవారికి స్పైసీగా ఈ మంచూరియా అనేది తయారు చేసుకోవచ్చు. దీన్ని పిల్లలూ పెద్దలూ ఎంతో ఇష్టపడి మరీ తింటారు. ఈ మంచూరియాని ఎవరి రుచికి తగ్గట్టుగా వారు చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినేవారు చికెన్‌తో చేసుకుంటారు. అయితే ఎగ్‌తో కూడా..

Egg Manchurian: వేడి వేడిగా ఎగ్ మంచూరియా.. ఇలా చేశారంటే ఫిదా అవుతారు!
Egg Manchurian
Follow us on

మంచూరియాల అనేది పూర్తిగా చైనీస్ వంటకం. కానీ మన భారత దేశపు మసాలాలు జోడించి.. ఇండియన్ స్టైల్‌లో మంచూరియా చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఎంతో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటుంది. తియ్యగా తినేవారికి తియ్యగా.. స్పైసీగా తినేవారికి స్పైసీగా ఈ మంచూరియా అనేది తయారు చేసుకోవచ్చు. దీన్ని పిల్లలూ పెద్దలూ ఎంతో ఇష్టపడి మరీ తింటారు. ఈ మంచూరియాని ఎవరి రుచికి తగ్గట్టుగా వారు చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినేవారు చికెన్‌తో చేసుకుంటారు. అయితే ఎగ్‌తో కూడా ఈ మంచూరియా అనేది తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యం కూడా. మరింకెందుకు లేట్.. ఈ టేస్టీ ఎగ్ మంచూరియా ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎగ్ మంచూరియాకు కావాల్సిన పదార్థాలు:

కోడి గుడ్లు, ఆయిల్, ఉప్పు, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా కెచప్, స్ప్రింగ్ ఆనియన్స్, వెనిగర్, కరివేపాకు, కొత్తి మీర.

ఎగ్ మంచూరియా తయారీ విధానం:

ముందుగా మీకు కావాల్సినన్ని కోడి గుడ్లను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గుడ్డును కొట్టాలి. ఆ గుడ్డు మిశ్రమంలో కార్న్ ఫ్లోర్ కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరీ పల్చగా కాకుండా.. కాస్త చిక్కగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న కోడి గుడ్లను వేసి ఓ రెండు నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక.. గుడ్లను వేసి ఫ్రై చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు మరో కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లి, అల్లం తరుగు వేసి బాగా వేయించుకోవాలి. నెక్ట్ ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. అందులోనే సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా కెచప్, మిరియాల పొడి, ఉప్పు, వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న గుడ్లను కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తి మీర వేసి ఒకసారి కలుపుకుని.. సర్వ్ చేసుకోవడం.