Cabbage Vadalu: టేస్టీ క్యాబేజీ మినపప్పు వడలు.. రుచి చూస్తే వదలరు..

వడలు లేదా గారెలు ఇవి అంటే చాలా మందికి ఇష్టం. చికెన్‌తో కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి. గారెలను చట్నీ, అల్లం పచ్చడి ఇలా వేటితో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. గారెలను ఎన్ని సార్లు తిన్నా అస్సలు బోర్ రాదు. అయితే వడల్ని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఒకసారి క్యాబేజీతో తయారు చేయండి. క్రంచీగా ఉంటాయి. క్యాబేజీ వడల రుచిని మరింత పెంచుతుంది. మరి ఈ క్యాబేజీ వడలు..

Cabbage Vadalu: టేస్టీ క్యాబేజీ మినపప్పు వడలు.. రుచి చూస్తే వదలరు..
Cabbage Vadalu

Edited By:

Updated on: Jul 09, 2024 | 9:16 PM

వడలు లేదా గారెలు ఇవి అంటే చాలా మందికి ఇష్టం. చికెన్‌తో కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి. గారెలను చట్నీ, అల్లం పచ్చడి ఇలా వేటితో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. గారెలను ఎన్ని సార్లు తిన్నా అస్సలు బోర్ రాదు. అయితే వడల్ని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఒకసారి క్యాబేజీతో తయారు చేయండి. క్రంచీగా ఉంటాయి. క్యాబేజీ వడల రుచిని మరింత పెంచుతుంది. మరి ఈ క్యాబేజీ వడలు ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

క్యాబేజీ వడలకి కావాల్సిన పదార్థాలు:

క్యాబేజీ తరుగు, మినపప్పు, శనగ పప్పు, అల్లం, కొత్తిమీర, పచ్చి మిర్చి, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, ఇంగువ, ఉప్పు, ఆయిల్.

క్యాబేజీ వడలు తయారీ విధానం:

ముందుగా మినపప్పు, శనగ పప్పులను నానబెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. రాత్రి అయినా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని కడిగాక మిక్సీలోకి తీసుకోవాలి. ఇందులో మిరియాలు, జీలకర్ర, ఇంగువ వేసి గట్టిగా పిండి రుబ్బుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా తరిగిన క్యాబేజీ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముద్ద, ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆయిల్ వేడి చేసుకోగానే.. పిండిని తీసుకుని వడల్లా ఒత్తుకుని వేసుకోవాలి. మంటను ఇప్పుడు మీడియంలోకి పెట్టాలి. వీటిని రెండు వైపులా బాగ వేయించుకోవాలి. ఆ తర్వాత టిష్యూ పేపర్‌లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ, కరకరలాడే క్యాబేజీ వడలు సిద్ధం. వీటిని వేటితో తిన్నా చాలా బావుంటాయి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.