Besan Laddu: శనగ పిండితో ఒక్కసారి ఈ లడ్డూ చేయండి.. నోట్లో కరిగిపోతుంది అంతే!

| Edited By: Ravi Kiran

Jun 08, 2024 | 10:45 PM

శనగ పిండితో ఎక్కువగా స్నాక్ ఐటెమ్స్ తయారు చేస్తూ ఉంటారు. ఏదైనా స్పెషల్ డేస్‌కి, పండుగలకు పకోడీలు చేస్తారు. కానీ ఒక్కసారి కాస్త శ్రమ తీసుకుని శనగ పిండితో ఈ లడ్డూలు తయారు చేయండి. తిన్నవారు మళ్లీ మళ్లీ కావాలంటారు. ఈ లడ్డూ ఎంతో రుచిగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్లకు కూడా నచ్చుతుంది. అందులోనూ ప్రస్తుతం సమ్మర్‌ కాబట్టి.. పిల్లలకు ఏదో ఒకటి కావాలి. ఇలా ఈసారి ట్రై..

Besan Laddu: శనగ పిండితో ఒక్కసారి ఈ లడ్డూ చేయండి.. నోట్లో కరిగిపోతుంది అంతే!
Besan Laddu
Follow us on

శనగ పిండితో ఎక్కువగా స్నాక్ ఐటెమ్స్ తయారు చేస్తూ ఉంటారు. ఏదైనా స్పెషల్ డేస్‌కి, పండుగలకు పకోడీలు చేస్తారు. కానీ ఒక్కసారి కాస్త శ్రమ తీసుకుని శనగ పిండితో ఈ లడ్డూలు తయారు చేయండి. తిన్నవారు మళ్లీ మళ్లీ కావాలంటారు. ఈ లడ్డూ ఎంతో రుచిగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్లకు కూడా నచ్చుతుంది. అందులోనూ ప్రస్తుతం సమ్మర్‌ కాబట్టి.. పిల్లలకు ఏదో ఒకటి కావాలి. ఇలా ఈసారి ట్రై చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఇంత టేస్టీగా ఉండే ఈ బేసన్‌ లడ్డూని ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శనగ పిండి లడ్డూకి కావాల్సిన పదార్థాలు:

శనగ పిండి, పంచదార, నెయ్యి, ఉప్పు, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, వంట సోడా, ఆయిల్.

బేసన్ లడ్డూ తయారీ విధానం:

ముందుగా శనగ పిండిని ఓ గిన్నెలోకి తీసుకోండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలపండి. ఇందులో కొద్దిగా ఆయిల్, నీళ్లు పోసి పకోడీ మిశ్రమంలా కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టండి. వేడెక్కాక.. ఒక జల్లెడ తీసుకుని బూందీలాగా ఆయిల్‌లో వేసుకోవాలి. బూందీ వేగాక.. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి.. పంచదార వేసి తీగ పాకం వచ్చే దాకా స్టవ్ మీద పెట్టి ఉంచాలి.

ఇవి కూడా చదవండి

తీగ పాకం వచ్చా.. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ పంచదారలో ముందుగా చేసుకున్నా బూందీని వేసి బాగా కలపాలి. ఆ నెక్ట్స్ నెయ్యి, యాలకుల పొడి కూడా వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు గోరు వెచ్చగా ఉండగానే లడ్డూలు చుట్టుకోవాలి. కావాలి అనుకున్న వారు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి లడ్డూలు చుట్టుకోవచ్చు. అంతే ఎంతో రుచిగా ఉండే బేసన్ లడ్డూ తయారు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది.