ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యమన్న విషయం తెలిసిందే. ఓట్స్‌తో రక రకాల వంటకాలు కూడా తయారు చేసుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు.. ఎలాంటివైనా రెడీ చేయవచ్చు. అదే విధంగా ఓట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇలాంటి వాటితో బ్రేక్ ఫాస్ట్ చేసుకుని తింటే.. మీ డే ఆరోగ్యవంతంగా తయారు అవుతుంది. ఓట్స్‌తో తయారు చేసుకునే హెల్దీ రెసిపీల్లో గుంత పొంగనాలు కూడా ఒకటి. వీటిని స్నాక్స్‌గా తినొచ్చు. చాలా రుచిగా ఉంటాయి. అదే విధంగా ఇన్ స్టెంట్‌గా తయారు చేసుకోవచ్చు. మార్నింగ్ తక్కువ సమయంలో వీటిని రెడీ చేయవచ్చు. మరి ఈ ఓట్స్ గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
ఓట్స్, పెరుగు, బియ్యం పిండి, బొంబాయి రవ్వ, క్యారెట్ తురుము, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, ఉప్పు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొత్తి మీర, వంట సోడా.
ముందుగా ఒక కడాయి తీసుకుని.. అందులో ఓట్స్ వేసి క్రిస్పీగా అయ్యేంత వరకూ వేయించాలి. వీటిని ఒక లోతైన గిన్నెలోకి తీసుకోవాలి. వీటిల్లోకే పెరుగు, బియ్యం పిండి, బొంబాయి రవ్వ, క్యారెట్ తురుము, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, సాల్ట్, సరిపడా నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఓ అరగంట పాటైనా నాన బెట్టుకోవాలి.
ఆయిల్ వేడెక్కే లోపు.. తాళింపు వేసి.. ముందుగా కలిపి పెట్టుకున్న ఓట్స్ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు గుంత పొంగనాల మూకిడి పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేయాలి. ఈ పిండిని కొద్దిగా తీసుకుని మూకిడిలో వేసుకోవాలి. వీటిని చిన్న మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యేంత వరకూ వేయించుకోవాలి.
ఇవి బాగా వేగాక.. ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ గుంత పొంగనాలు సిద్ధం. ఇలా తయారు చేసుకున్న ఓట్స్ గుంత పొంగనాలను ఏ చట్నీతో తిన్నా చాలా బావుంటాయి. పిల్లలకు టమాటా సాస్ తో కలిపి ఇవ్వొచ్చు. ఎంతో ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ లోకి కూడా వీటిని తీసుకెళ్లవచ్చు.