Healthy Breakfast: టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఓట్స్ ఎగ్.. టేస్ట్ సూపర్ అంతే!

| Edited By: Ravi Kiran

Jul 23, 2024 | 10:00 PM

ప్రస్తుతం ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినాలంటే కష్టమే అని చెప్పొచ్చు. ఎప్పుడూ ఒకేలాంటి బ్రేక్ ఫాస్ట్ తిని బోర్ కొట్టే వాళ్లకు ఇది బెస్ట్ అని చెబుతున్నారు నిపుణులు. ఈ బ్రేక్ ఫాస్ట్‌ని చాలా తక్కువ సమయంలోనే సులభంగా చేసుకోవచ్చు. కానీ రుచి మాత్రం అదిరిపోతుందనే చెప్పాలి. అంత టేస్టీగా ఉంటుంది. అదే 'ఓట్స్ ఎగ్' బ్రేక్ ఫాస్ట్. మీరు ఎప్పుడైనా ఓట్స్ వేరుగా గుడ్డు వేరుగా తిని ఉంటారు. కానీ వీటిని జత చేసి చేసే బ్రేక్ ఫాస్ట్ ఇది. ఒక్కసారి ఈ హెల్దీ బ్రేక్ ఫాస్ట్..

Healthy Breakfast: టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఓట్స్ ఎగ్.. టేస్ట్ సూపర్ అంతే!
Oats Egg
Follow us on

ప్రస్తుతం ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినాలంటే కష్టమే అని చెప్పొచ్చు. ఎప్పుడూ ఒకేలాంటి బ్రేక్ ఫాస్ట్ తిని బోర్ కొట్టే వాళ్లకు ఇది బెస్ట్ అని చెబుతున్నారు నిపుణులు. ఈ బ్రేక్ ఫాస్ట్‌ని చాలా తక్కువ సమయంలోనే సులభంగా చేసుకోవచ్చు. కానీ రుచి మాత్రం అదిరిపోతుందనే చెప్పాలి. అంత టేస్టీగా ఉంటుంది. అదే ‘ఓట్స్ ఎగ్’ బ్రేక్ ఫాస్ట్. మీరు ఎప్పుడైనా ఓట్స్ వేరుగా గుడ్డు వేరుగా తిని ఉంటారు. కానీ వీటిని జత చేసి చేసే బ్రేక్ ఫాస్ట్ ఇది. ఒక్కసారి ఈ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ట్రై చేయండి. శరీరానికి శక్తిని ఇస్తూ.. నాలుకకు రుచిని అందిస్తుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్‌గానే కాకుండా డిన్నర్‌గా కూడా తినొచ్చు. మరి ఈ హెల్దీ ఓట్స్ ఎగ్ బ్రేక్ ఫాస్ట్ ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఓట్స్ ఎగ్ బ్రేక్ ఫాస్ట్‌కి కావాల్సిన పదార్థాలు:

ఓట్స్, ఎగ్స్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, క్యాప్సికం, పసుపు, ఉప్పు, కొత్తి మీర తరుగు, టమాటా, ఆయిల్, మిరియాల పొడి.

ఓట్స్ ఎగ్ బ్రేక్ ఫాస్ట్ తయారీ విధానం:

ముందుగా స్టవ్ వెలగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక క్యాప్సికం ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగా టమాటా కూడా వేసి మెత్తగా అయ్యేదాకా వేయించాలి. టమాటాలను చిన్న మంట మీదే వేయించాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి కలపాలి. మీకు కాస్త ఘాటు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఇదే సమయంలో కోడి గుడ్లను పగుల కొట్టి వేసి బాగా కలుపుకోవాలి. ఎగ్ వేగుతున్నప్పుడు.. ఓట్స్‌ని ఒకసారి కడిగి ముందుగానే ఓ అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని వేసుకుని.. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. చివరిగా కొత్తి మీర తరుగు చల్లుకుని ఒకసారి అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ ఎగ్ బ్రేక్ ఫాస్ట్ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.