
నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన వాటిల్లో మటన్ ముందు ఉంటుంది. మటన్‌తో ఎలాంటి ఐటెమ్స్ చేసినా చాలా రుచిగా ఉంటాయి. రెస్టారెంట్లకు వెళ్లగానే చాలా మంది ఎక్కువగా ఆర్డర్ ఇచ్చే ఐటెమ్స్‌లో మటన్ సూప్ ఒకటి ఉంటుంది. సూప్ ఏదైనా ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనూ మటన్ సూప్ మరింత మంచిది. మహిళలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన వాటిల్లో మటన్ సూప్ కూడా ఒకటి. ఇలాంటి ఆరోగ్యకరమైన మటన్ సూప్‌ని.. ఎలా సింపుల్‌గా తయారు చేసుకోవాలో ఇప్పుడు ట్రై చేద్దాం. మటన్ సూప్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ మటన్ సూప్ ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మటన్ మూలుగ ఎముకలు, బోన్ లెస్ మటన్, పుదీనా, కొత్తి మీర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి, వెల్లుల్లి తరుగు, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ, నెయ్యి.
ముందుగా మటన్ ఎముకలను, బోన్ లెస్ మటన్‌ను శుభ్రంగా కడిగి కుక్కర్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే మటన్‌కి సరిపడా.. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకులు, కొద్దిగా నెయ్యి, నీళ్లు వేసి ఓ పది విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి. కుక్కర్ ఆవిరి పోయాక.. మూత తీసి నీటిని వడకట్టాలి. ఇప్పుడు మటన్ బోన్ లెస్ ముక్కల్ని సన్నగా తరిగి ఆ నీటిలో వేయండి. ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి స్టవ్ మీద పెట్టండి.
ఇప్పుడు మరో పక్క కడాయి పెట్టి అందులో కొద్దిగా నీళ్లు వేసి.. అందులో వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఇవి బాగా వేగాక.. మటన్ రసంలో వేసి మరో ఐదు నిమిషాలు మరిగించాలి. కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయవచ్చు. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ సూప్ సిద్ధం. ఇక సర్వింగ్ బౌల్స్‌లోకి తీసుకుని ఆరగించడమే. ఈ మటన్ సూప్ తాగాలని పించే కొద్దీ తాగాలనిపిస్తుంది.