Mango Lassi: మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!

వేసవి కాలానికి మరో పేరు కూడా ఉంది. అతే మామిడి కాయల సీజన్. ఎందుకంటే ఈ కాలంలోనే ఎక్కువగా మామిడి పండ్లు లభిస్తాయి. మళ్లీ ఎన్ని రసాయనాలు వేసి పెంచినా.. మామిడి పండ్లు రావు. ఈ సీజన్‌లో ప్రత్యేకంగా దొరికే మామిడి పండ్లను ఖచ్చితంగా తినండి. ఈ పండ్ల కోసం చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. మామిడి పండులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి.. అస్సలు మిస్ చేయకండి. మామిడి పండుతో ఎన్నో రకాల వంటలు తయారు..

Mango Lassi: మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
Mango Lassi

Edited By: Shaik Madar Saheb

Updated on: May 09, 2024 | 10:15 PM

వేసవి కాలానికి మరో పేరు కూడా ఉంది. అతే మామిడి కాయల సీజన్. ఎందుకంటే ఈ కాలంలోనే ఎక్కువగా మామిడి పండ్లు లభిస్తాయి. మళ్లీ ఎన్ని రసాయనాలు వేసి పెంచినా.. మామిడి పండ్లు రావు. ఈ సీజన్‌లో ప్రత్యేకంగా దొరికే మామిడి పండ్లను ఖచ్చితంగా తినండి. ఈ పండ్ల కోసం చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. మామిడి పండులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి.. అస్సలు మిస్ చేయకండి. మామిడి పండుతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. వాటిల్లో ఈ మ్యాంగో లస్సీ కూడా ఒకటి. వేసవి కాలంలో చల్ల చల్లగా ఒక్క గ్లాస్ ఈ లస్సీ తాగండి. ఎంతో చల్లగా అనిపించడం ఖాయం. ఈ లస్సీ ఎంతో రుచిగా కూడా ఉంటుంది. మరి ఈ మ్యాంగో లస్సీని ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మ్యాంగో లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

మామిడి పండ్లు, పెరుగు, కాచి చల్లార్చిన పాలు, డ్రై ఫ్రూట్స్ తరుగు, యాలకుల పొడి, చక్కెర లేదా తేనె.

మ్యాంగో లస్సీ తయారీ విధానం:

ఈ లస్సీ చేయాలంటే బాగా పండిన మామిడి పండ్లను తీసుకుని.. గుజ్జు అంతా తీసి ఒక గిన్నెలో వేయండి. ఈ గుజ్జును ఇప్పుడు మిక్సీ జ్యూస్ గిన్నెలో వేయండి. ఇదే గిన్నెలో పెరుగు, కాచి చల్లార్చిన పాలను కూడా వేసి ఒక్క సారి మిక్సీ తిప్పండి. ఆ తర్వాత చక్కెర లేదంటే తేనె, యాలకుల పొడి కూడా వేసి మరోసారి బ్లెండ్ తీసి.. ఓ బౌల్‌లోకి తీసుకోండి. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచి తాగడమే.

తాగే ముందు డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే మ్యాంగో లస్సీ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కూడా దీన్ని తయారు చేసి పెట్టి ఇవ్వొచ్చు. అంతే కాదు ఈ లస్సీ తాగడం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. శరీరాన్ని చల్ల బరుస్తుంది.