Healthy Breakfast: వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!

| Edited By: Shaik Madar Saheb

Dec 29, 2024 | 9:45 PM

టేస్టీగా, వెరైటీగా తినాలని మనసు చెబుతూ ఉంటుంది. అలాంటి వారు ఈ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా ట్రై చేయవచ్చు. ఇది రుచిగా ఉండటమే కాకుండా.. కొద్దిగా తిన్నా కడుపును నిండుగా ఉంచుతుంది. కాబట్టి ఎక్కువగా కూడా తీసుకోలేరు. ఆరోగ్యానికి మంచి చేసే పదార్థాలే ఎక్కువ. అది కూడా చియా సీడ్స్‌తో.. ఇవి హెల్త్‌కి చేసే మేలు అంతా ఇంతా కాదు..

Healthy Breakfast: వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!
Chia Seeds Breakfast
Follow us on

ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం కూడా ఒకటి. వీటి కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బరువును తగ్గించుకునేందుకు డైట్ కూడా మెయిన్ టైన్ చేస్తూ ఉండాలి. రోజూ తినే వాటిని తినీ తినీ బోర్ కొడుతుంది. టేస్టీగా, వెరైటీగా తినాలని మనసు చెబుతూ ఉంటుంది. అలాంటి వారు ఈ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా ట్రై చేయవచ్చు. ఇది రుచిగా ఉండటమే కాకుండా.. కొద్దిగా తిన్నా కడుపును నిండుగా ఉంచుతుంది. కాబట్టి ఎక్కువగా కూడా తీసుకోలేరు. ఆరోగ్యానికి మంచి చేసే పదార్థాలే ఎక్కువ. అది కూడా చియా సీడ్స్‌తో.. ఇవి హెల్త్‌కి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. పెద్దగా హైరానా పడాల్సిన పని లేదు. మరి చియా సీడ్స్‌తో హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చియాసీడ్స్‌తో హెల్దీ బ్రేక్ ఫాస్ట్:

చియా సీడ్స్, బాదం పాలు లేదా పాటు, కొద్దిగా వెన్నిలా క్రీమ్, తేనె, బనానా లేదా స్ట్రాబెర్రీలు, యాపిల్, దానిమ్మ ఇలా ఏదైనా తీసుకోవచ్చు.

చియాసీడ్స్‌తో హెల్దీ బ్రేక్ ఫాస్ట్:

ముందుగా చియా సీడ్స్‌ని ఓ పది నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు వీటిని ఒక గాజు గ్లాస్ లేదా గాజు గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో బాదం మిల్క్ లేదంటే సాధారణ కాచిన పాలను అయినా తీసనుకోవచ్చు. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం వెన్నిలా క్రీమ్ యాడ్ చేస్తారు. ఇందులో మీకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే తేనె కూడా ఒక స్పూన్ కలపాలి. ఇది కూడా ఆప్షనల్. కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉదయాన్నే చేసుకుంటే ఓ అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి.

ఇవి కూడా చదవండి

రాత్రి పూట రెడీ చేసుకుంటే.. ఉదయాన్నే తినేయవచ్చు. ఇక మీరు తినే ముందు బనానా లేదా స్ట్రాబెర్రీలు, యాపిల్, దానిమ్మ ఇలా ఏదైనా మీకు నచ్చి పండ్ల ముక్కలను కట్ చేసి వేసుకోవచ్చు. మీకు కావాలంటే నానబెట్టిన డ్రై నట్స్‌ పై నుంచి వేసి గార్నిష్ చేసుకోవచ్చు. అంతే ఎంతో రుచిగా ఉండే హెల్దీ బ్రేక్ ఫాస్ట్ సిద్ధం. దీన్ని మీరు డిన్నర్ లేదా స్నాక్‌లా కూడా తీసుకోవచ్చు. మంచి పోషకాలు అన్నీ శరీరానికి అందుతాయి.