Bal Mithai: ఉత్తరాఖండ్ ఫేమస్ స్వీట్.. ‘బాల్ మిఠాయి’ ఇంట్లో కూడా చేసుకోవచ్చు..

| Edited By: Shaik Madar Saheb

Jul 29, 2024 | 5:43 PM

ప్రాంతాలను బట్టి కొన్ని ఐటెమ్స్ చాలా ఫేమస్. అలానే ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి మోస్ట్ ఫేమస్ ఐటెమ్.. బాల్ మిఠాయి. చిన్న గుండ్రటి ఆకారంలో ఉండే ఈ మిఠాయి ఉత్తరా ఖండ్‌‌లో చాలా ఫేమస్. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్ట పడి మరీ తింటారు. ఈ స్వీట్‌ కేవలం ఒక ఫ్లేవర్‌లోనే కాకుండా చాలా రకాలు, పరిమాణాల్లో కూడా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఫేమస్. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. శరీరంలోని కణాలను బాగా రక్షిస్తాయి. ఈ స్వీట్ తింటే శరీరానికి తక్షణమే..

Bal Mithai: ఉత్తరాఖండ్ ఫేమస్ స్వీట్.. బాల్ మిఠాయి ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
Bal Mithai
Follow us on

ప్రాంతాలను బట్టి కొన్ని ఐటెమ్స్ చాలా ఫేమస్. అలానే ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి మోస్ట్ ఫేమస్ ఐటెమ్.. బాల్ మిఠాయి. చిన్న గుండ్రటి ఆకారంలో ఉండే ఈ మిఠాయి ఉత్తరా ఖండ్‌‌లో చాలా ఫేమస్. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్ట పడి మరీ తింటారు. ఈ స్వీట్‌ కేవలం ఒక ఫ్లేవర్‌లోనే కాకుండా చాలా రకాలు, పరిమాణాల్లో కూడా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఫేమస్. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. శరీరంలోని కణాలను బాగా రక్షిస్తాయి. ఈ స్వీట్ తింటే శరీరానికి తక్షణమే శక్తిని కూడా ఇస్తుంది. అయితే ఇందులో చక్కెర, కొవ్వు శాతం మాత్రం కాస్త ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగాలి అనుకునేవారు వీటిని తింటే చాలా మంచిది. మరి ఈ బాల్ మిఠాయి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

బాల్ మిఠాయికి కావాల్సిన పదార్థాలు:

పాలు, పంచదార, జెలాటిన్, వెనిల్లా ఎసెన్స్, మీకు ఇష్టమైన ఏదో ఒక ఫ్లేవర్స్.

బాల్ మిఠాయి తయారీ విధానం:

ముందుగా నీటిలో కొద్దిగా జెలాటిన్ నానబెట్టాలి. ఆ తర్వాత పాలను ఒక పాత్రలో వేసి బాగా మరిగించాలి. పాలు బాగా మరుగుతున్నప్పుడు ఇందులో పంచదార కూడా వేసి మరో ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత జెలాటిన్ మిశ్రమాన్ని పాలలో వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో వెనిల్లా ఎసెన్స్, అలాగే మీకు ఇష్టమైన ఫ్లేవర్ కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీకు ఇష్టమైన షేప్‌లో ఉండే మోల్డ్‌లలో పోసి డీప్ ఫ్రిజ్‌లో రెండు గంటలైనా ఉంచాలి.

ఇవి కూడా చదవండి

మీరు తినాలి అనుకున్నప్పుడు వీటిని తీసి తినడమే. కావాలి అనుకుంటే వీటికి డ్రై ఫ్రూట్స్ కోటింగ్, కోకో పౌడర్, కొబ్బరి ఇలా మీకు నచ్చిన వాటితో కూడా కోటింగ్ ఇచ్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ఈ రెసిపీ కూడా చాలా సింపుల్‌గా పూర్తి అవుతుంది.