Garlic Fried Rice: రెస్టారెంట్ స్టైల్ గ్లారిక్ ఫ్రైడ్ రైస్ ను ఇలా చేయండి.. ఆహా అనాల్సిందే!!

రెస్టారెంట్లలో లభ్యమయ్యే ఫ్రైడ్ రైస్ లలో.. గార్లిక్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదలి పెట్టరు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూడా మనం ఈజీగా వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకోవచ్చు. కరెక్ట్ గా చేస్తే.. రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. ఒక్కసారి చేసుకున్నారంటే.. వీలైనప్పుడల్లా చేస్తారు. ఇంట్లో వాళ్లు ఇది తిన్నారంటే.. మళ్లీ మళ్లీ చేయమంటారు. వీకెండ్స్ లో, ఏమైనా స్పెషల్ గా చేయాలనుకున్నప్పుడు వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. వెల్లుల్లితో చేస్తారు..

Garlic Fried Rice: రెస్టారెంట్ స్టైల్ గ్లారిక్ ఫ్రైడ్ రైస్ ను ఇలా చేయండి.. ఆహా అనాల్సిందే!!
Fried Rice

Edited By:

Updated on: Sep 26, 2023 | 11:45 PM

రెస్టారెంట్లలో లభ్యమయ్యే ఫ్రైడ్ రైస్ లలో.. గార్లిక్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదలి పెట్టరు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూడా మనం ఈజీగా వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకోవచ్చు. కరెక్ట్ గా చేస్తే.. రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. ఒక్కసారి చేసుకున్నారంటే.. వీలైనప్పుడల్లా చేస్తారు. ఇంట్లో వాళ్లు ఇది తిన్నారంటే.. మళ్లీ మళ్లీ చేయమంటారు. వీకెండ్స్ లో, ఏమైనా స్పెషల్ గా చేయాలనుకున్నప్పుడు వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. వెల్లుల్లితో చేస్తారు కాబట్టి ఆరోగ్యం కూడా. మరి ఈ గార్లిక్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

బాస్మతీ రైస్, ఆయిల్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, బీన్స్, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, వెనిగర్, పంచదార.

ఇవి కూడా చదవండి

గార్లిక్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం:

ముందుగా బాస్మతీ రైస్ ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. నెక్ట్స్ ఒక బాండీ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, వేడి చేసుకోవాలి. ఇందులో తరిగి పెట్టకున్న వెల్లుల్లిన వేసి.. కాస్త దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో అల్లం, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చిల్లీ సాస్ వేసి.. ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి కలుపుకోవాలి.

ఆ తర్వాత పక్కన పెట్టుకున్న అన్నం, సోయా సాస్, వెనిగర్, ఉప్పు, వెల్లుల్లి, పంచదార వేసుకుని పెద్ద మంట మీద బాగా టాస్ చేసుకోవాలి. పెద్ద మంట మీదనే ఐదు నిమిషాల వరకు అన్నాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొత్తి మీర చల్లి సర్వ్ చేసుకోవడమే. అంతే ఏంతో టేస్టీగా ఉండే గార్లిక్ ఫ్రైడ్ రైస్ సిద్ధం. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్ ని. ఇందులో కూరగాయలు, వెల్లుల్లి ఉంటుంది కాబట్టి హెల్దీగానే ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.