Maida Adulteration: ఈ సులభమైన చిట్కాతో మైదా పిండిలోని కల్తీని కనిపెట్టండి!

కల్తీ ఉత్పత్తులు, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకుంటే వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కొని...

Maida Adulteration: ఈ సులభమైన చిట్కాతో మైదా పిండిలోని కల్తీని కనిపెట్టండి!
Maida Adulteration

Updated on: Oct 19, 2021 | 4:22 PM

కల్తీ ఉత్పత్తులు, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకుంటే వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టేందుకు ‘భారత ఆహార పరిరక్షణ, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’ తరచూ కొన్ని చిట్కాలు పంచుకుంటోంది. ‘డిటెక్టింగ్‌ ఫుడ్‌ అడల్ర్టెంట్స్’ హ్యాష్‌ ట్యాగ్‌తో అధికారిక ట్విట్టర్‌లో కొన్ని వీడియోలు పంచుకుంటోంది. తద్వారా మనం తీసుకునే ఆహార పదార్థాలు మంచివా? కల్తీవా? అనే విషయాలపై సులభంగా అవగాహన కల్పిస్తోంది.

బోరిక్‌ యాసిడ్‌ను కనిపెట్టేందుకు!

మనం వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే ఆహార పదార్థాల్లో మైదా పిండి కూడా ఒకటి. అయితే ఈ అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు మైదాలో బోరిక్‌ యాసిడ్‌ను మిక్స్‌ చేసి విక్రయిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు మైదాను కొనుగోలు చేసేటప్పుడు ఎవరూ కల్తీ చేసిన విషయాన్ని గుర్తుపట్టలేరు. ఈ నేపథ్యంలో మైదాలోని స్వచ్ఛతను కనిపెట్టేందుకు FSSAI ఓ సులభమైన చిట్కాను షేర్‌ చేసింది. అదేంటంటే..!

ఒక టెస్ట్‌ ట్యూబ్‌లో గ్రాము మైదా పిండిని తీసుకోవాలి. అందులోకి 5 మిల్లీ లీటర్ల నీటిని పోసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం కలపాలి. ఆ తర్వాత పసుపు కాగితం స్ట్రిప్‌ను ముంచాలి. మైదా పిండిలో ఎలాంటి కల్తీ లేకపోతే పేపర్‌ స్ట్రిప్‌ రంగు మారదు. ఒకవేళ పేపర్‌ ఎర్ర రంగులోకి మారితే అందులో బోరిక్‌ యాసిడ్‌ను మిక్స్‌ చేశారని అర్థం చేసుకోవాలి.

Read Also: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?

Tomato Price: మండుతున్న టమోట ధరలు.. సామాన్యుడు విలవిల.. కిలో ధర ఎంతంటే..?

Custard Apple Farming: సీతాఫలం సాగుతో అధిక లాభాలు.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..

Dry Cough: పొడి దగ్గుని తక్కువ అంచనా వేయకండి..! తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి..