Crabs Curry Recipe: గోదావరి జిల్లా స్పెషల్.. పీతల పులుసు.. టేస్టీగా ఎలా తయారు చేయాలంటే..

|

Jan 27, 2022 | 11:05 AM

Crabs Curry Recipe: నాన్ వెజ్ ప్రియులలో సీఫుడ్ లవర్స్(Sea Food Lovers) డిఫరెంట్. రొయ్యలు, చేపలు, పీతలుతో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. ముఖ్యంగా ఆంధ్రా(Andhra)లోని గోదావరి జిల్లా..

Crabs Curry Recipe:  గోదావరి జిల్లా స్పెషల్.. పీతల పులుసు.. టేస్టీగా ఎలా తయారు చేయాలంటే..
Peetala Pulusu
Follow us on

Crabs Curry Recipe: నాన్ వెజ్ ప్రియులలో సీఫుడ్ లవర్స్(Sea Food Lovers) డిఫరెంట్. రొయ్యలు, చేపలు, పీతలుతో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. ముఖ్యంగా ఆంధ్రా(Andhra)లోని గోదావరి జిల్లా వాసులకు సీఫుడ్ అంటే మరీ ఇష్టం. ఈ సీజన్ లో దొరికే వాటిని ఆ సీజన్ లో రకరకాల వంటలు చేసుకుని ఆహా ఏమి రుచి అంటూ లోట్టలేసుకుంటూ తింటారు. ఈరోజు గోదావరి జిల్లా స్పెషల్ వంటకం పీతల పులుసు తయారీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:
పీతలు
వంకాయలు
ధనియాలు- 2 టేబుల్ స్పూన్‌లు
జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్
లవంగాలు – నాలుగు
వెల్లుల్లి రెబ్బలు -ఆరు
ఉల్లిపాయలు- రెండు
పచ్చిమిర్చి- 6
పసుపు- ఒక చిన్న స్పూన్
కారం- రుచికి సరిపడా
ఉప్పు రుచికి సరిపడా
కొట్టిమీర – తగినది
చింతపండు గుజ్జు – పెద్ద నిమ్మకాయ సైజు
నూనె-తగినంత

తయారీ విధానం: పీతలను తీసుకుని వాటిని బాగా శుభ్రంగా కడిగి ఓ పక్కకు పెట్టుకోవాలి. చింతపండును ఒక గిన్నెలో నీరు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సి గిన్నెలో ఉల్లిపాయలను, ధనియాలు, లవంగాలు, జీలకర్ర, వెల్లిల్లి రెబ్బలను వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక దళసరి గిన్నె పెట్టుకుని ఐదు స్పూన్ల నూనె వేసీ వేడి చేసుకోవాలి. నూనె వేడి ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని దానిలో నిలువుగా కట్ చేసుకున్న పచ్చి మిర్చిని వేసుకొని పసుపు వేసి.. వేయించాలి. ఉల్లిపాయ మిశ్రమం పచ్చి స్మెల్ పోయిన తర్వాత అందులో పీతలు వేసుకుని ఒక్కసారి మెదిపి.. కొంచెం సేపు మీడియం మంటలో మగ్గనిచ్చి.. తర్వాత కారం, వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. అనంతరం వంకాయలను నిలువుగా సన్నగా కట్ చేసి.. వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వత చింతపండు గుజ్జుని రసం తీసుకుని పులుసు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి.. కొంచెం సేపు మరగనివ్వాలి. ఉప్పు, పులుపు చూసుకుని పీతలు కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని మూత పెట్టి.. స్విమ్ లో పులుసు దగ్గర పడేవరకూ ఉడికించుకోవాలి. అంతే ఎంతో టేస్టీ టేస్టీ పీతల పులుసు రెడీ. అమ్మమ్మకాలం నాడు.. పీతల పులుసుని మట్టిదాకలో వండేవారు. దీంతో మరింత రుచిగా ఉండేది.

Also Read:

 పెళ్లి కూతురు లుక్ లో కుర్రకారు మతులు పోగొడుతున్న ఇలియానా.. ఫోటోలు వైరల్..