పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఆహారం మ్యాగీ. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మొదలు..ఈవీనింగ్ స్నాక్ ఐటమ్ వరకు ఎప్పుడైనా సరే మ్యాగీని చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే, మ్యాగీని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుందనే భయంతో కొంతమంది మ్యాగీని తినకుండా ఉంటారు. కొంతమంది డైట్‌లో ఉన్నప్పుడు కూడా మ్యాగీని తినరు. అయితే, డైటింగ్ చేస్తున్నప్పుడు నిజంగా మ్యాగీ తినాలా వద్దా..? అలా తింటే మీ ఆరోగ్యానికి మంచిదా.. కదా..? ఈ రోజు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూట్రిషనిస్ట్ సిమ్రత్ కతురియా వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో డైటింగ్ చేస్తున్న వారు మ్యాగీ తినాలా? వద్దే అనే విషయం గురించి వారు వివరించారు.
న్యూట్రిషనిస్ట్ సిమ్రత్ కతురియా మాట్లాడుతూ, మ్యాగీ అనేది మా చిన్ననాటి నుండి కాలేజ్ వరకు స్నేహితులతో చాలా సార్లు మ్యాగీ తినేవాళ్లం.. ఇక లెక్కలేనన్ని పార్టీలు కూడా మ్యాగీతోనే చేసుకునే వాళ్లం అని చెప్పారు. మ్యాగీ అంటే చాలా ఇష్టం, ఆరోగ్యవంతమైన ఆహారం తినేవాళ్లు కూడా మ్యాగీకి నో చెప్పలేరు. కానీ, డైటింగ్ చేస్తున్నప్పుడు మ్యాగీ తినాలా వద్దా..? అనేది ముఖ్యమైన ప్రశ్న. దీని కోసం మ్యాగీలో ఉండే పోషకాలను తెలుసుకుందాం.
ఒక ప్లేట్ మ్యాగీలో 205 కేలరీలు, 9.9 గ్రాముల ప్రోటీన్లు, 131 పిండి పదార్థాలు ఉంటాయి. ఇతర స్నాక్స్‌తో పోలిస్తే మ్యాగీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు డైట్‌లో ఉన్నప్పుడు కూడా మ్యాగీని హ్యాపీగా తినవచ్చు. అయితే, మీరు డైట్‌లో ఉండి మ్యాగీని తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నారు. అయితే, మ్యాగీ అందరికీ ఇష్టమైన ఫేమస్ వంటకమే. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి సమయాల్లోనైనా ఈజీగా లభించే, చేసుకుని తినగలిగేది కూడా మ్యాగీ. మీరు సినిమా చూస్తూ కూడా హాయిగా మ్యాగీని ఆస్వాదించవచ్చు, కానీ అది మంచి ఆరోగ్యానికి ప్రత్యామ్నాయం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మ్యాగీలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు వంటివి ఏవీ లేవు. మ్యాగీ ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేయడానికి, మ్యాగీ రుచిని పెంచడానికి రసాయనాలను ఎక్కువ మొత్తంలో కలుపుతుంటారు. ఈ మ్యాగీలో కొవ్వులు, పిండి పదార్థాలు, ఉప్పుశాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు, ఫైబర్ వంటివి ఏవీ లేవు కాబట్టి మ్యాగీ తినడం వల్ల బరువు తగ్గే అవకాశం లేదు. అందుకే మ్యాగీని కేవలం నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తినటం మంచిదని వివరించారు.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.
మరిన్ని లైప్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..