రోజుకి ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

అధిక రక్తపోటును పెంచే కొవ్వును కలిగి ఉన్నందున బీపీ కూడా పెరుగుతుంది. అందుకే అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం గుడ్లకూ దూరంగా ఉండటం మంచిదని వైద్యలు చెబుతున్నారు. మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో గుడ్డును తీసుకోవాలంటే డాక్టర్ సలహాను తీసుకొవాలని సూచిస్తున్నారు. వారానికి రెండు లేదా మూడు గుడ్లు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు.

రోజుకి ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Eggs

Updated on: Jun 02, 2025 | 1:39 PM

గుడ్డులో విటమిన్ ఎ, బి, సి, డి, ఇ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. గుడ్లు తినే సంఖ్య వయసు, బరువు, శారీరక శ్రమ, ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉన్నవారు పచ్చసొన ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయి పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదానికి దారి తీస్తుందని చెబుతున్నారు.

అలాగే, గుండె జబ్బులు ఉన్నవారు గుడ్డులోని పచ్చసొనకు బదులు తెల్లసొన తినవచ్చు అంటున్నారు నిపుణులు. ఆరోగ్యవంతులు, బరువు తగ్గించుకునేవారు రోజుకి మూడు గుడ్ల వరకు తినచ్చు. షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారు రోజుకి ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినాలనుకుంటే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాత.. ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.

గుడ్లు అతిగా తినడం వల్ల అపానవాయువు సమస్య వస్తుంది. ఇది శరీరంలో వేడిని కలిగిస్తుంది. కడుపులో తిమ్మిర్లు, వికారం వంటి సమస్యలు కూడా వస్తాయి. అధిక రక్తపోటును పెంచే కొవ్వును కలిగి ఉన్నందున బీపీ కూడా పెరుగుతుంది. అందుకే అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం గుడ్లకూ దూరంగా ఉండటం మంచిదని వైద్యలు చెబుతున్నారు. మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో గుడ్డును తీసుకోవాలంటే డాక్టర్ సలహాను తీసుకొవాలని సూచిస్తున్నారు. వారానికి రెండు లేదా మూడు గుడ్లు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలున్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..