Home Hints: బ్యాచిలర్స్‌‌కు గుడ్‌న్యూస్.. వంట మాడిపోయి తంటాలు పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

|

Dec 29, 2021 | 9:37 PM

బ్యాచిలర్స్ వంట చేస్తున్నప్పుడు నానా తంటాలు పడుతుంటారు. వంటలు చేస్తున్నప్పుడు పొరపాటున వంట మాడిపోతే ఇలా చేయండి.

Home Hints: బ్యాచిలర్స్‌‌కు గుడ్‌న్యూస్.. వంట మాడిపోయి తంటాలు పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..
Burning Is Coming From Food
Follow us on

బ్యాచిలర్స్ వంట చేస్తున్నప్పుడు నానా తంటాలు పడుతుంటారు. అన్నం ఎలా వండాలి..? కూరల్లో ఎంత ఉప్పు వేయాలి..? ఎంత కారం వేయాలి..? ఏ సమయంలో వాటిని దింపాలి..? ఇలాంటి సమస్యలు బ్యాచిలర్స్‌కు సహజంగా వస్తుంటాయి. వర్క్ ఫ్రమ్ హో వచ్చిన తర్వాత ఓ వైపు ఆఫీసు వర్క్ చేస్తూనే చేతులు కాల్చుకుంటున్నారు. ఇందులో పురుషులతోపాటు మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు చేస్తున్న వంట మాడి పోతుంది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాదు. ఇళ్లు మొత్తం ఆ మాడిన వాసలు చికాకు పెట్టిస్తుంటాయి. అయితే, ఆహారం పూర్తిగా మాడిపోయినప్పుడు మాత్రమే దాని నుండి మాడిన వాసనలు వస్తుంటాయి. ఇలంటి సమయంలో మనం కొన్ని చిట్కాలను పాటించాలి. మాడినప్పటికీ అందులో కొంత ఆహారాన్ని సేవ్ చేయవచ్చు.

మాడిన పప్పు

ప్రెషర్ కుక్కర్‌లో పప్పు వండుతున్నప్పుడు. కొన్నిసార్లు తక్కువ నీరు పోయడం కారణంగా పప్పు మాడిపోతుంది. మీకు కూడా ఇలా జరిగితే గరిటె సహాయంతో ముందుగా పైనుండి పప్పును తీసి వెంటనే చల్లార్చండి. తర్వాత దాదాపు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత గంట తర్వాత గ్యాస్‌పై బాణలి పెట్టి ఉల్లిపాయ టొమాటోలు వేసి పప్పులా చేసి, పైన నెయ్యి, ఇంగువ వేసి వేయించి ఉంచితే రుచితోపాటు వాసన కూడా పోతుంది.

గ్రేవీతో కూడిన కూరగాయల నుంచి..

గ్రేవీతో కూరగాయ చేసి కొన్ని కారణాల వల్ల మాడిన వాసన వస్తుంటే ముందుగా బాణలిలోంచి కూరగాయలను తీసి శుభ్రమైన పాత్రలో ఉంచాలి. ఒకటి లేదా రెండు చెంచాల మజ్జిగ, పెరుగు కలిపి కొన్నింటికి ఉడికించాలి.  కూరగాయలను సుమారు 10 నుండి 15 నిమిషాలు ఉడికించాలి. దీని కారణంగా మాడిన వాసన అస్సలు రాదు.

ఫ్రై కర్రీస్ నుంచి..

ఫ్రై కర్రీలను చేస్తున్నప్పుడు మాడిపోతుందనే భయం అందిరిలోనూ ఉంటుంది. చాలా సార్లు ఫ్రై బెండకాయ, ఫ్రై చికెన్ ఇలాంటి చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అటువంటి పరిస్థితిలో ఫ్రై కర్రీ మాడిపోతే.. మొదట ప్లేట్‌లోకి మంచిగా ఉన్నటువంటి కర్రీని తీసుకోవాలి. ఆపై గ్యాస్‌పై కొత్త పాన్ వేసి 1 లేదా 2 చెంచాల శనగపిండిని చల్లితే సరిపోతుంది. ఆపై ఫ్రై కర్రీని కలపండి. శెనగపిండి పరిమాణం కూరగాయను బట్టి ఉండాలి.ఇలా చేయడం వల్ల కూరగాయల నుండి మాడిన  వాసన అస్సలు రాదు.

ఇవి కూడా చదవండి: Telangana: తెలంగాణకు వెల్లువలా పెట్టుబడులు.. ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న అమూల్‌..

New Year Celebrations: తగ్గేదెలే అంటే తాటతీస్తాం.. న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్