నేటి బిజీ జీవనశైలిలో ఒత్తిడి మన మానసిక ఆరోగ్యంపై భారీ ప్రభావం చూపిస్తోంది. ఎక్కువ గంటలు పని చేయడం.. కుటుంబ బాధ్యతల ఒత్తిడి, మీ పనితో పాటు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. దాని ప్రభావం మీ స్వభావంలో కూడా కనిపిస్తుంది. మీరు ఎవరితో మాట్లాడకపోవడం, చిరాకు పడటం, ఆఫీసులో మనస్సు లేకపోవడం వంటి ఇతర సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతి చిన్న విషయం గురించి ఆందోళన చెందడం వల్ల మనలో ఒత్తిడి పెరుగుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా మీ మానసిక స్థితి దెబ్బ తింటుంది. మానసిక స్థితిని మెరుగుపరచడానికి మీరు మీ ఆహారంలో కొన్ని సూపర్‌ఫుడ్‌ని చేర్చడం ద్వారా ఇలా సమస్యకు చెక్ పట్టవచ్చని గుర్తుంచుకోండి. వీటిని తినడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది మీ ఒత్తిడిని దూరం చేసేందుకు సహాయపడుతుంది. ఈ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
కోకోలో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. దీని ఉపయోగం మన మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. సెరోటోనిన్ అనేది మన మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడే ఒక ప్రధాన హార్మోన్.
బరువు తగ్గడానికి.. కడుపులో మంటను తగ్గించడానికి గ్రీన్ టీని ఉపయోగిస్తారు. గ్రీన్ టీలో కాటెచిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును పెంచడంలో సహాయపడతాయి. ఇది వ్యక్తి అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇందులో కెఫిన్ ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
క్యాప్సికంలో విటమిన్ ఎ, బి -6 పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు అభివృద్ధిని పెంచడంలో సహాయపడుతుంది. శరీరం సెరోటోనిన్, నోర్‌పైన్‌ఫ్రైన్ అనే హార్మోన్లను తయారు చేయడానికి సహాయపడుతుంది.
ఒమేగా -3 గుండె జబ్బులను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సాల్మన్, అవిసె గింజలు, చియా గింజల్లో ఒమేగా -3 పుష్కలంగా ఉంటాయి.
ఆరోగ్యకరమైన గట్ కోసం పులియబెట్టిన ఆహారం చాలా ముఖ్యం. ఇందులో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. కిమ్చి, మజ్జిగ, సౌర్క్క్రాట్, మిసో, ఊరగాయ కూరగాయలు, కేఫీర్, పెరుగు వంటి ఆహారాలలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ వస్తువులలో సెరోటోనిన్ పుష్కలంగా ఉంటుంది.
నట్స్‌లో విటమిన్లు, మినరల్స్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం తీసుకోవడం తగ్గితే డిప్రెషన్ ముప్పు పెరుగుతుంది.
పాలకూర, మెంతికూరలో విటమిన్ బి ఫోలేట్ ఉంటుంది, దీని లోపం సెరోటోనిన్, డోపామైన్ వంటి ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్ల జీవక్రియను అడ్డుకుంటుంది. అయితే, మానసిక ఆరోగ్యంపై ఫోలేట్ ప్రభావం ఏమిటి? దీని గురించి ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
కెఫిన్ మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మీ శరీరంలో డోపామైన్‌ను ప్రేరేపించడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాఫీ తాగడం వలన చిరాకు, బాధ, నిద్రలేమికి కారణమైతే దానిని తాగడం మానేయాలి.
ఇవి కూడా చదవండి: AP Government: ఇక ఏపీలో అది కుదరదంటే.. కుదరదు.. కొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కార్..
Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బ్రేకప్ చెప్పాడు.. 3 ఏళ్ల బంధం విడిపోవడానికి కారణం అదేనట..